నవ్వించే సిల్లీ ఫెలోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో ప్రొడక్షన్ 3గా వస్తున్న చిత్రం ‘సిల్లోఫెలోస్’. అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్లా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరవు మాట్లాడుతూ- అల్లరి నరేష్‌తో నేను తీసిన ‘సుడిగాడు’ పెద్ద హిట్. మళ్లీ మా కాంబినేషన్‌లో సిల్లీఫెలోస్ రిపీట్ అవుతుండడం ఆనందంగా ఉంది. సునీల్ ఈ చిత్రంలో కీ రోల్ చేస్తున్నారు. సునీల్ నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేశారో అదే ఈ సినిమాలో వుంటుంది. హీరోలు అని కాకుండా మంచి కమిట్‌మెంట్‌తో వర్క్ చేశారు ఇద్దరూ. సిల్లీఫెలోస్ మూడో విజయం అవుతుందని ఆశిస్తున్నా. ఇందులో చిత్రా శుక్లా పాత్ర చాలా డిఫికల్ట్ అయినా బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చింది అన్నారు. నిర్మాతల్లో ఒకరైతన భరత్ చౌదరి మాట్లాడుతూ- సుడిగాడు కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ ఈ సినిమాని చేస్తున్నాం. సినిమా విడుదల తరువాత మేము ఈ సినిమాని ఎందుకు చేశామో తెలుస్తుంది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. నేనే రాజు నేనే మంత్రి, ఎంఎల్‌ఏ చిత్రాల తరువాత మా బ్యానర్‌లో వస్తున్న మూడవ సినిమా. తప్పకుండా హ్యాట్రిక్ కొడతామన్న నమ్మకం ఉంది అన్నారు. సునీల్ మాట్లాడుతూ- ఆడియన్స్ నా నుంచి ఏదైతే ఇన్నాళ్లు మిస్ అయ్యారో.. అదే నేను కూడా మిస్ అయ్యాను. కానీ సిల్లీఫెలోస్‌తో ఆ కోరిక తీరనుంది అన్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ- సుడిగాడు లాంటి హిట్‌సినిమాను ఇచ్చాక మళ్లీ మా కాంబినేషన్‌లో రావాలంటే మొదట భయం వేసింది. ఆ రేంజ్ హిట్ ఇవ్వగలమా అని. కానీ దాదాపు మూడు సంవత్సరాలు స్క్రిప్ట్‌పై పనిచేసిన సినిమా సిల్లీఫెలోస్. పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్నాం. ఇందుకు తోడయ్యాడు సునీల్. తప్పకుండా ఈ ప్రొడక్షన్‌లో వస్తున్న మూడో సినిమా కనుక హ్యాట్రిక్ కొడుతున్నాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అనిష్ తరుణ్‌కుమార్, సంగీతం: శ్రీవసంత్, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాతలు: కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరి, దర్శకుడు: భీమనేని శ్రీనివాస్.