ప్రేమ పరిచయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ జంటగా నటించిన చిత్రం ‘పరిచయం’. ఓ యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అసిన్ మూవీక్రియేషన్స్ పతాకంపై రియాజ్ నిర్మించారు. శేఖర్‌చంద్ర స్వరాలు అందించారు. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో ‘అటుఇటు అని ఏమైందో మనసా..’ అంటూ సాగే పాట తాలూకు వీడియోసాంగ్‌ను విడుదలచేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తోపాటు ముఖ్యఅతిథులుగా దర్శకులు హరీష్‌శంకర్, సుధీర్‌వర్మ, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా హరీష్‌శంకర్ మాట్లాడుతూ.. ‘మంచి తెలుగు టైటిల్..’ టీజర్ చూశా. ఫొటోగ్రఫీ చాలాబాగుంది. ఇప్పుడు విడుదల చేసిన పాట కూడా చాలా బాగుంది. దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో ముందుకెళుతున్నారు. హీరోహీరోయిన్ల జోడీ బాగుంది. సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు.శేఖర్‌చంద్ర మాట్లాడుతూ.. ‘పాటలు బాగావచ్చాయి. పాటలన్నింటికీ సాహిత్యం బాగా కుదిరింది. ఇప్పుడు విడుదలచేసిన పాటకు వనమాలి అందించిన సాహిత్యం.. ఆ పాటని మరో స్థాయికి తీసుకెళ్ళింది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. దర్శకుడు లక్ష్మీకాంత్ దగ్గర్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొత్త ఫీల్‌ని ఇస్తుంది’ అన్నారు. చిత్ర దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా మాట్లాడుతూ.. ‘ప్రేమ అంటే ఏమిటి? అనే క్వశ్చన్ వేసుకుని.. ఈ సినిమా కథని ప్రారంభించాను. కొంతమంది యువతీ యువకులను ప్రేమ గురించి అడిగితే ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెప్పుకొచ్చారు. సరైన అభిప్రాయం మాత్రం రాలేదు. నాకు తెలిసి.. ప్రేమ అంటే ప్రాణం. మన ప్రాణానికి ఏమైనా అవుతుందంటే మనం ఏ రిస్క్‌కూడా చేయలేము. ప్రాణాన్నికూడా లెక్కచేయకుండా ఎవరికైనా ఏదైనా చేయగలిగితే అదే ప్రేమ. ఒక తల్లి ప్రాణంపోయినా పర్లేదు అనుకుంటూ బిడ్డకు జన్మనిస్తుంది. అదే.. ప్రేమంటే.. అలా ప్రాణానికిమించి ప్రేమించే ప్రేమికుల కథనే మా ‘పరిచయం’ చిత్రంలో చూపించబోతున్నాం. రెండు మనసులమధ్య ప్రేమ పుట్టాలన్నా, రిలేషన్ ఏర్పడాలన్నా పరిచయం ఉండాలి.