ఆకాశంలో పాటల హరివిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యశ్రీ, సుబ్బారెడ్డి, శ్రావణి ముఖేష్, నరేష్ ముఖ్య పాత్రల్లో క్రాంతి కిరణ్ దర్శకత్వంలో ఓం శక్తి ప్రొడక్షన్స్ పతాకంపై బి.సత్యశ్రీ నిర్మిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’. శ్రీనివాస్ మాలపాటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు శనివారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన నవ్యంధ్ర ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఎస్.వి.ఎన్.రావు, నిర్మాత సాయి వెంకట్‌లు పాటల సీడీలను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవ్యంధ్ర ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఎస్.వి.ఎన్.రావు మాట్లాడుతూ.. అచ్చమైన తెలుగు టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ట్రయిలర్ బాగుంది. మంచి కథతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చాలా సినిమాలు నిరూపించాయి. అలాగే నిర్మాత సత్యశ్రీ అన్ని విషయాల్లో ముందుండి ఈ సినిమాను నడిపించారు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ సాధించి ఈ యూనిట్‌కు మంచి విజయాన్ని అందివ్వాలి అన్నారు. చిత్ర దర్శకుడు క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. రెండో చిత్రం, మొదటి సినిమా కూడా పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు అవకాశం ఇచ్చిన నిర్మాత సత్యశ్రీ గారికి ధన్యవాదాలు, కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన మంచి ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాలో నాకు సపోర్ట్‌చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అన్నారు. హీరో, హీరోయిన్లు మాట్లాడుతూ.. ఈ సినిమాతో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత సత్యశ్రీ మాట్లాడుతూ.. దర్శకుడు, కెమెరామెన్ రెమో, హీరోహీరోయిన్లు ఈ నలుగురి సపోర్ట్‌వల్లే ఈ సినిమాను తీయగలిగాను. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: సన్‌సోర్స్ డిసైన్, సంగీతం: శ్రీనివాస్ మాలపాటి, కెమెరా: రెమో జి ఆశిష్, కథ, నిర్మాత: సత్యశ్రీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క్రాంతికిరణ్.