నాని సరసన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస విజయాలతో జోరుమీదున్న నాని అటు వరుస సినిమాలుచేస్తూ బిజీగా మారాడు. ఇప్పటికే నాగార్జునతో కలిసి మల్టీస్టారర్‌లో నటిస్తున్న ఆయన మరో రెండు చిత్రాలకు ఓకే చెప్పాడు. దాంతోపాటు బిగ్‌బాస్ 2 టీవి షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా నాని హీరోగా గౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కే జెర్సీ సినిమాలో హీరోయిన్‌గా గ్లామర్ భామ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపిస్తాడట. సెప్టెంబర్‌నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఈ సినిమాలో శృతిహాసన్ నటిస్తుందన్న న్యూస్ హల్చల్ చేస్తుంది. ఈ మధ్య శృతిహాసన్ కూడా వరుస పరాజయాలతో సతమతమైంది. కాటమరాయుడు తరువాత శృతిహాసన్ ఏ సినిమాలో నటించలేదు. అటు తమిళంలో కూడా శభాష్‌నాయుడు మాత్రమే నటించింది. ఆ తరువాత ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. మళ్ళీ చాలా గ్యాప్ తరువాత రవితేజ సినిమాలో నటిస్తుందని టాక్.