కొత్తదనం కోరుకునేవాళ్ల కోసమే... --దర్శకుడు అజయ్ భూపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తికేయ, పాయల్ రాజపుత్ హీరో హీరోయిన్లుగా కెపిడబ్ల్యూ బ్యానర్‌పై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న చిత్రం ఆర్‌ఎక్స్ 100. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
ట్రైలర్ రెస్పాన్స్ బాగుంది.. ఈ రెస్పాన్స్‌తో నాకు మరింత బాధ్యత పెరిగింది. ఒక చిన్న సినిమాకు ఈ రేంజ్‌లో వ్యూస్ వస్తాయని అనుకోలేదు. ఆర్‌ఎస్స్ 100 అంటే... 90వ దశకంలో వున్న జనరేషన్ అందరికీ అదొక రోల్‌మోడల్ బండి. అప్పట్లో నేను చిన్నతనంలో వున్నపుడు ఆ బండి నాకు ప్రత్యేకంగా కనిపించేది. ఈ సినిమాలో హీరోది కూడా ఎవరినీ పట్టించుకోని వ్యక్తి. రూడ్ బిహేవియర్ వున్న వ్యక్తి. హీరో శివ పాత్ర కూడా అలాగే వుంటుంది. ఒక రకమైన నిర్లక్ష్య ధోరణితో సాగే పాత్ర అతనిది. రియలిస్టిక్ లవ్‌స్టోరీ ఇది. ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఆర్‌ఎక్స్ 100 పెట్టాం. పూర్తిస్థాయి కంప్లీట్ లవ్‌స్టోరీ. ఓ మండల స్థాయి టౌన్‌లో జరిగిన కథ. అన్నిరకాల అంశాలతో ఈ సినిమా వుంటుంది. దానితోపాటు ఫ్యామిలీ ప్రేక్షకులు అందరూ చూసే సినిమా ఇది. సినిమాలో చాలా ఎమోషన్స్, రొమాన్స్ అన్నీ ఉంటాయి. వర్మ ప్రభావం తప్పకుండా వుంటుంది. ఆయనను చూసి ఇన్‌స్ఫైర్ అయి ఆయన దగ్గర పనిచేశాను. వర్మ హర్రర్ సినిమాలు తీశారు కానీ ఆయనలా ఆయన శిష్యులు ఎవరు సినిమాలు తీయలేదు. ఈ సినిమా గురించి వర్మ అడిగారు. ఆయన అసిస్టెంట్స్‌కు మంచి ఎంకరేజ్ ఇస్తారు. వీరప్పన్ సినిమాకు కొన్ని షాట్స్ నేనే తీశాను. ఇందులో రాంకీ హీరో తండ్రి పాత్రలో కనిపిస్తాడు. అలాగే రావు రమేష్‌ది అందరికీ నచ్చేలా వుంటుంది. రియలిస్టిక్ జోనర్‌లో వుంటూ అందరికీ నచ్చేలా ఉంటుంది. హీరోయిన్ చాలా బోల్డ్ పాత్రలో కనిపిస్తుంది. హీరోని మించిన రూడ్ అమ్మాయి. హీరో హీరోయిన్ ఇద్దరూ పోటీ పడి నటించారు. పాయల్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కథ అనుకున్న తరువాత కొత్త వాళ్ళతో ఆయితేనే బాగుంటుందని ముందు విజయ్ దేవరకొండకు చెప్పాను పెళ్లిచూపులు ముందు.. కానీ అది కుదరలేదు. ఆ తరువాత కొత్తవాళ్ళతో వెళ్ళాను. ఈ చిత్రానికి మ్యూజిక్ చైతన్ భరద్వాజ్ చేశాడు. అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. సౌండ్, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. సినిమా వర్క్ మొత్తం పూర్తయింది. సినిమా చూసుకున్నాం.. చాలా ఆనందంగా వుంది. కొత్త సినిమా, భిన్నమైన సినిమా చూడాలని అనుకున్నవాళ్ళకు నచ్చే సినిమా ఇది.