రెమ్యూనరేషన్ పెంచిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస సినిమాలతో మంచి జోరుమీదున్న గ్లామర్ భామ మెహ్రీన్ కౌర్ టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుతం గోపీచంద్ సరసన పంతం సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడి క్రేజ్ పెరిగిన నేపథ్యంలో తన రెమ్యూనరేషన్ పెంచేసిందట. ప్రస్తుతం ఈ అమ్మడు 70 లక్షలు ఇస్తే తప్ప కొత్త అవకాశాలు ఒప్పుకోవడం లేదట. ఇప్పటివరకు అరకోటికే సినిమాలు చేసిన ఈ భామ తాజాగా రెమ్యూనరేషన్ పెంచేయడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు. అంతేలే.. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నిజం ఈ భామ ఇప్పుడు తెలుసుకున్నట్టుంది. తాజాగా విరించి వర్మ దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్ హీరోగా నటించే సినిమాకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో వాళ్ళు అడిగినంతా ఇచ్చుకోక తప్పలేదట. ప్రస్తుతం ఈ అమ్మడికి తమిళంలో కూడా అవకాశాలు క్యూ కడుతున్నాయి.