‘ఒకటే లైఫ్’ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లార్డ్స్ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై యువ నిర్మాత నారాయణరామ్ నిర్మిస్తున్న చిత్రం ‘ఒకటే లైఫ్’ హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం ఆడియో విడుదలైంది. బి.జె.పి. అధికార ప్రతినిధి రఘునందనరావు ఆడియోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సూపర్‌గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి.చౌదరి కుమారుడు రమేష్‌చౌదరి హీరోగా నటిస్తున్నారంటే.. దీనిని సూపర్ గుడ్ కుటుంబంగా భావించవచ్చును. ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగంలో వారిని ప్రోత్సహించాలి. కొత్తదనం రావాలి. చిన్న సినిమాలు బతకాలి. నాలుగు కుటుంబాలు, నలుగురు హీరోలే అంటే కుదరని పరిస్థితి వచ్చింది.. కొత్తవాళ్ళు వస్తే కొత్త ఆలోచనలతో చిత్రసీమ కొత్త కళలతో నిండుగా ఉంటుంది అన్నారు. నిర్మాత నారాయణరామ్ మాట్లాడుతూ.. బిగ్ సీడీ విడుదలకు రఘునందనరావుగారు రావటం చాలా ఆనందంగా ఉంది. ఆడియో సక్సెస్ అయినట్లే.. సినిమా కూడా సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను అన్నారు. దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. నాకు ఇది తొలి అవకాశం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతకు.. నాకు పూర్తి సహకారం అందించిన హీరోకి ధన్యవాదాలు.. టెక్నాలజీతో పరుగుపెడుతున్న నేటితరం మానవత విలువలకు కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం. వచ్చేనెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు అన్నారు. హీరో రమేష్‌చౌదరి మాట్లాడుతూ.. ‘ఒకటే లైఫ్’ సినిమా నాకు పెద్ద టర్నింగ్ అవుతుంది. తెలుగులో ‘విద్యార్థి’ చిత్రం తరువాత కొన్ని తమిళ సినిమాలు చేశాను. చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రం చేస్తున్నాను. యువతకి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రమిది. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అని అన్నారు.