ఏసినిమాకైనా అదే ప్రయత్నం -- హీరో గోపీచంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయాపజయాలను పక్కనపెడితే.. మంచి కథలతోనే సినిమాలు చేశాను అంటున్నాడు గోపీచంద్. ఆయన హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘పంతం’. ఫర్ ఎ కాజ్.. ఉప శీర్షిక. మెహ్రీన్ హీరోయిన్. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా హీరో గోపీచంద్‌తో ఇంటర్వ్యూ..
* 25వ సినిమా అని కేర్ ఎక్కువ తీసుకున్నారా?
- నేను 25వ సినిమా ఇది అని లెక్కపెట్టుకోలేదు. స్టోరీ అంతా వినేసిన తర్వాత చూస్తే ఇదే నా 25వ సినిమా అయ్యింది. ప్రతి సినిమా నాకు ఫస్ట్ సినిమాయే. అయితే నా 25వ సినిమాగా ఇది సెట్ కావడం ఆనందంగా వుంది.
* పంతం ఎవరిపై?
- సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. మన సొసైటీలో జరిగే ఓ ఇష్యూ గురించి మాకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నించాం. సినిమా చూసే ప్రేక్షకులు కూడా అవును, మన చుట్టూ ఈ సమస్య ఉంది కదా! దీన్ని పరిష్కారం చేస్తే బావుంటుంది కదా అనిపిస్తుంది. నాన్నగారు (టి.కృష్ణ) చేసినంత పవర్‌ఫుల్ స్టోరీ ఎందుకు చేయలేదు అని చాలామంది అడిగారు. అందరికీ అలాంటి కథ నా దగ్గరకు రాలేదు అని చెబుతూ వచ్చాను. ఇపుడు పంతం నాన్నగారి సినిమాలా వుంటుంది. అయితే ఇది పూర్తిస్థాయిలో అలాంటి చిత్రం కాదు. కానీ ఆ సోషల్ కాజ్ ఇందులో వుంది. సినిమా అనేది పవర్‌ఫుల్ మీడియా. దాని ద్వారా ఓ మంచి చెప్తే రీచ్ అవుతుందని నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడిని. ఈ సినిమాతో ఆ అవకాశం నాకు దక్కింది.
* కొత్త దర్శకుడితో వెళ్లడానికి కారణం?
- చక్రి కథ చెప్పినపుడు తనను అడిగిన మొదటి ప్రశ్న- ‘నువ్వు కథ బాగా చెప్పావ్.. అంత బాగా తీయగలవా?’ అని. తను నవ్వుతూ ‘మీరు నాకు ఛాన్స్ ఇస్తే తప్ప నేను చెప్పలేను సార్’ అన్నాడు. తను ఆ రోజు కథను ఎలాగైతే చెప్పాడో.. ఎగ్జిక్యూషన్ కూడా అలాగే చేశాడు. దీనికి ప్రసాద్ మూరెళ్లగారి అనుభవం తోడయ్యింది. చక్రి, ప్రసాద్ డిస్కస్ చేసుకుని సినిమా చేశారు. మంచి విజన్ వున్న వ్యక్తి.
* మీ పాత్ర ఎలా వుంటుంది?
- అందరూ బావుండాలని కోరుకునే పాత్ర. తన చుట్టూ జరిగే ఓ సమస్యను రూపుమాపడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు.
* డైలాగ్స్ విషయంలో ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నారు?
- ఈ సినిమాకు రమేశ్ రెడ్డి, శ్రీకాంత్ డైలాగ్స్ రాశారు. డైలాగ్స్‌తో కలిసే నేను స్టోరీ విన్నాను. సెకెండాఫ్‌లో ఓ ఫేజ్ వచ్చినపుడు పవర్‌ఫుల్ డైలాగ్స్ వుంటాయి. టీజర్‌లో, ట్రైలర్‌లో పవర్ ఏంటో తెలుస్తుంది. అలాంటి డైలాగ్స్ చాలానే ఉన్నాయి. అలాంటి డైలాగ్స్ ఉన్న సీన్స్ చేయాలని చాలా రోజులుగా కోరిక వుండేది. అవకాశం వచ్చింది. బాగా ఎంజాయ్ చేసి చేశాను.
* ఈమధ్య కెరీర్ పరంగా అంత సంతృప్తిగా లేనట్టున్నారు?
- నా ప్రతి సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. కానీ సినిమా ఫ్లాప్ అయితే ఎవరైనా సరే బాధపడతారు. నేనూ అంతే. అయితే ఆ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడతాను. ఏదైనా మనం వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఏ సినిమా అయినా చేస్తాం.. ఫలితం మన చేతిలో లేదుగా..
* స్టార్ దర్శకులతో చేయకపోవడానికి కారణం?
- వాళ్ళకు నాతో సినిమా చేయాలని వస్తే తప్పకుండా చేస్తాను. ఎప్పుడైనా సరే ముందు నాకు కథ నచ్చితేనే.
* ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారు?
- అవును. ఎన్నో రోజులుగా నేను ఎదురుచూస్తున్నది ఇలాంటి కథ కోసమే. సోషల్ మెసేజ్ నేపథ్యంలో మంచి కంటెంట్‌తో సినిమా చేయడంతో సినిమాపై పూర్తి నమ్మకం ఉంది.
* హీరోయిన్ మెహ్రీన్ గురించి?
- మెహ్రీన్ చాలా మంచి అమ్మాయి. ముఖ్యంగా చాలా ప్రొఫెషనల్‌గా వుంటుంది. నటనాపరంగా చాలా బాగా చేస్తున్నది. ఈ సినిమాలో మా ఇద్దరి పెయిర్ బాగా కుదిరిందని అంటున్నారు.
* నిర్మాత గురించి?
- నిర్మాత రాధామోహన్‌ని శ్రీ్ధర్ పరిచయం చేశారు. కొత్త డైరెక్టర్ కదా.. ఎలా తీస్తాడోనని ఆయన ఆలోచించారు. ‘కథ వినండి, మీకు నచ్చితే ముందుకు వెళదాం’ అన్నాను. ఆయనకు కథ నచ్చడంతో ఓ బడ్జెట్ ఫిక్స్ చేసుకుని సినిమాను పూర్తిచేశాం. ఇపుడు నిర్మాత కూడా హ్యాపీయే. రాధామోహన్ మాటపై నిలబడే జెంటిల్‌మెన్.
* ఈ సినిమా విడుదలవుతున్నది కదా, టెన్షన్ పడుతున్నారా?
- నేను చేసిన 25 సినిమాల కథలు మంచివే. జయాపజయాలు పక్కన పెడితే.. మంచి కథలతోనే సినిమాలు చేశాను. ఎగ్జిక్యూషన్ సమస్యవల్ల సినిమా సరిగా సక్సెస్ అయ్యుండకపోవచ్చంతే. అయితే ప్రతి సినిమా విడుదల సమయంలో టెన్షన్ ఎలాగూ వుంటుంది.
* తదుపరి చిత్రాలు?
- బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో కుమార్ అనే డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నాను. క్లీన్ లవ్‌స్టోరీ అది. దాంతో పాటు సంపత్ నందితో కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలు తెలియజేస్తాను.
-- శ్రీ