సర్కార్ కోసం భారీ పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మురగదాస్ దర్శకత్వంలో ఇళయ దళపతి నటిస్తున్న 62వ చిత్రం ‘సర్కార్’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. ఈ చిత్ర హక్కుల కోసం 105 కోట్లు చెల్లించడానికి రెడీగా ఉన్నారట. ఫైనల్‌గా ఈ రేటు కాస్త 120 కోట్లదాకా వెళ్ళే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయ్‌కి వున్న ఫాలోయింగ్ దృష్ట్యా భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమవుతున్నారట డిస్ట్రిబ్యూటర్స్. గతంలో విజయ్ నటించిన ‘మెర్సెల్’ చిత్రం కూడా 100 కోట్లపైనే బిజినెస్ చేసింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, యోగి బాబు మొదలగువారు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది.