శూర్పణఖగా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణంలో బాగా గుర్తున్న పేరు. లక్ష్మణుడి చేతిలో అవమానం పాలై.. అన్న రావణుడితో చెప్పి సీత అపహరణకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. అసలు రామాయణం జరగడానికి ప్రత్యక్ష కారకురాలిగా మారిన శూర్పణఖ తరహా పాత్రలో నటించేందుకు అందాల చందమామ కాజల్ రెడీ అయింది? ఇప్పటివరకూ గ్లామర్ హీరోయిన్‌గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది. రావణుడి సోదరుల నెగెటివ్ షేడ్‌లో ఈ పాత్ర సాగనుందట. ఈ సినిమాలో శూర్పణఖ అందంగా ఉంటుందట. కానీ గుణం మాత్రం చెడ్డదట. ఈ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు భార్గవ్. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కే ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కనుందట. కాజల్ నటించేందుకు ఓకె చెప్పడంతో దర్శకుడు అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. కాజల్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.