త్వరలో దర్శకత్వం -- కె.కె.సింథిల్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్‌దేవ్ తొలి చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా, ఆ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన కె.కె.సింథిల్‌కుమార్ కాస్సేపు ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... ‘‘నేను బాహుబలి తరువాత ఏ చిత్రం చేయాలనే గందరగోళంలో ఉన్న సమయంలో ఒక రోజు నేను రాజవౌళి ఫామ్‌హౌస్‌లో నిర్మాత సాయి కొర్రపాటిగారిని కలుసుకున్నాను. అప్పుడు ఆయన విజేత గురించి చెప్పారు. సాయిగారు నన్ను ప్రాజెక్టులో భాగం కావాలని అడిగినప్పుడు, కొంచెం సంశయంతోనే సరే అని చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు రాకేశ్ శశి పూర్తి కథ వినిపించి స్క్రిప్ట్ అందించాడు. కథ నాకు బాగా నచ్చింది. దాంతో మనస్ఫూర్తిగా ఈ ప్రాజెక్టుచేయాలని నిర్ణయించుకున్నాను. ఒక మంచి కుటుంబ కథా చిత్రం. తండ్రీ, కొడుకుల మధ్య సాగుతూ వారిమధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రంలో ప్రతి భావోద్వేగ సన్నివేశం చాలా సహజంగా ఉంటుంది. అనేక సందర్భాల్లో సినిమాలోని పాత్రలతో ప్రేక్షకులు మమేకం అవుతారు. బాహుబలి బడ్జెట్ వేరు, ఆ స్పాన్ వేరు. ఇక ఈ చిత్రానికి బడ్జెట్ పరిమితులు ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొనే పనిచేశాను. ఒక రకంగా నా కెరీర్ మొదలైన ఆ రోజుల్లోకి వెళ్లి పనిచేసినట్లు అనిపించింది. షూటింగ్ ప్రారంభంలో తనకి ఆ వాతావరణం పూర్తిగా కొత్త. కానీ తరువాత అలవాటు చేసుకున్నాను. కళ్యాణ్‌దేవ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే మంచి నటుడయ్యే సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో తాను మంచి నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకుంటాడు. తనకి కష్టపడే స్వభావం ఉంది. ఈ సినిమా బాగా రావటానికి చాలా కృషిచేశాడు. బాలీవుడ్ నుండి కొన్ని ఆఫర్లువచ్చాయి. కానీ నేను ఆ స్క్రిప్ట్‌లకి కనెక్ట్‌కాలేకపోయాను. ఏమైనా బాహుబలి తర్వాత విజేతకి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇక డైరెక్టర్ అవ్వాలని ప్రతి టెక్నీషియన్‌కు ఉంటుంది. దానికి నేను మినహాయింపు ఏమీ కాదు. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కాని మెగాఫోన్ పట్టుకోవటానికి ఆత్రుత ఏంలేదు. కొంత సమయం తీసుకున్నా మంచి అర్థవంతమైన చిత్రంతోనే మీ ముందుకు వస్తాను.