‘24 కిస్సెస్’ ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెబ్బాపటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన ‘24 కిస్సెస్’ సినిమా ఫస్ట్‌లుక్ ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే సందర్భంగా విడుదల చేసారు. ‘మిణుగురులు’ చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘మిణుగురులు’ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది. ‘నీకో సగం నాకో సగం ఈ ఉత్సవం’ ట్యాగ్‌లైన్‌తో ఉన్న ఈ పోస్టర్ అంచనాలను పెంచింది. కొత్త కానె్సప్ట్‌తో వస్తున్న ఈ సినిమా యువతను అలరించబోతోంది. సిల్లీమొంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ ‘24 కిస్సెస్’ సినిమాను నిర్మించాయి. హెబ్బాపటేల్, అరుణ్ అదిత్, అదితి మ్యాక, రావురమేష్, నరేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, నిర్మాతలు: సంజయ్‌రెడ్డి, అనిల్‌పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి, లైన్ ప్రొడ్యూసర్: గోవింద్‌రెడ్డి, కెమెరామెన్: ఉదయ్ గుర్రాల, సంగీతం: జాయ్ బరువ, ఎడిటర్: ఆలయం అనిల్, రచయితలు: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, హరిశంకర్, పాటలు: రామ జోగయ్యశాస్ర్తీ, ఆర్ట్ డైరెక్టర్: హరివర్మ, కోడైరెక్టర్: శ్రవణ్‌కుమార్.