గీతతో వస్తున్న గోవిందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్‌రెడ్డి చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ తన కెరీర్ స్టార్టింగ్‌నుండి తన చిత్రాల్ని ప్రమోట్ చేసుకునే విధానం కొత్తగా వుండటమే కాకుండా ఆడియన్స్‌కి స్ట్రయట్‌గా రీచ్ అయ్యేలా తన స్టేట్‌మెంట్ వుంటుంది. ఎక్కడా మిడిల్ డ్రాప్‌లు వుండవనేది అర్జున్‌రెడ్డిని ప్రమోట్ చేసిన విధానంలోనే అందరికీ తెలిసింది. ఇప్పుడు తను నటించిన ‘గీత గోవిందం’ చిత్రం కూడా అదే తరహాలో ఆడియన్స్‌కి రీచ్ అయ్యేలా ఆయామ్ 25 స్టిల్ వర్జిన్ అనే క్యాప్షన్ పోస్టర్‌తో తన పాత్ర తీరును తెలియజేసేలా విడుదల చేశారు. ఈ చిత్రంలో చలో హీరోయిన్ రష్మిక మందాన్న గీత పాత్రలో నటిస్తున్నారు. గీతాఆర్ట్స్‌లో శ్రీరస్తు శుభమస్తు లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో విజయం సాధించిన పరుశురాం (బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గీత గోవిందం’. ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మాణంలో ఎస్ ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ సమర్పణలో జిఎ2 పిక్చర్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ‘గీత గోవిందం’ మొదటి లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌వచ్చింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. మా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌గారు చిత్ర సమర్పకులుగా, నేను నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం గీత గోవిందం. ఈ చిత్రంలో మా గోవిందం అలియాస్ విజయ్ దేవరకొండ సూపర్ పెర్‌ఫార్మెన్స్‌తో మరొకసారి ప్రేక్షకుల ముఖ చిత్రాన్ని తనవైపుకు తిప్పుకుంటాడనే నమ్మకం మాకుంది. పరశురాంకి ఫ్యామిలీ ఎమోషన్స్‌ని తెరకెక్కించటం వెన్నతో పెట్టిన విద్య. ఈ చిత్రం మరొక్కసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ప్రశంసలు పొందుతుంది. గోపీసుందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. గీత గోవిందం చేసే అల్లరి యూత్‌ని ఆకట్టుకుంటాయి. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అని అన్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న, నాగబాబు, సుబ్బరాజు, వెనె్నల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గిరిబాబు, అన్నపూర్ణమ్మ, వౌర్యాని, సుభాష్, అభయ్, స్వప్నక, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, గుండు సుదర్శన్, గౌతంరాజు, అనీష్, కళ్యాణి నటరాజన్, సంధ్య జనక్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పకులు: అల్లు అరవింద్, నిర్మాత: బన్నీవాసు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పరశురామ్, సంగీతం: గోపీసుందర్, సినిమాటోగ్రాఫర్: మణికందన్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్.