తొలిప్రేమతోనే పోలుస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలిప్రేమ, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి లవ్ స్టోరీస్ స్పెషలిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్న దర్శకుడు ఎ.కరుణాకరన్. తాజాగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, స్టన్నింగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై వల్లభ సమర్పణలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మించిన ‘తేజ్’ ఐ లవ్ యు చిత్రానికి దర్శకత్వం వహించారు టాలెంటెడ్ దర్శకుడు కరుణాకరన్. ఈ చిత్రం ఈనెల 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ ఓపెనింగ్స్‌ని సాధించి సూపర్‌హిట్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎ.కరుణాకరన్ చెప్పిన విశేషాలు.. తేజ్ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. రియల్ ఇన్సిడెంట్ సీన్స్‌కి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇంతకుముందు నేను చేసిన లవ్‌స్టోరీస్‌లో ఇదొక డిఫరెంట్ స్క్రీన్‌ప్లే వున్న చిత్రం. ఫ్రెండ్స్, బంధువులు ప్రతి ఒక్కరూ ఫోన్లు చేస్తూ సినిమా చాలా బాగుంది అని చెబుతున్నారు. పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. మెగా ఫ్యాన్స్ అంతా సపోర్టు చేస్తున్నారు. థియేటర్‌లో ప్రతి ఒక్కరూ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌లో ఇది నా రెండో చిత్రం. కథల విషయంలో ఆయనకి పర్‌ఫెక్ట్ జడ్జిమెంట్ వుంటుంది. వెరీ జీనియస్ ప్రొడ్యూసర్ రామారావుగారు. అందరం ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వాలని కృషి చేశాం. ఇంత మంచి బ్యూటీఫుల్ చిత్రాన్ని నిర్మించిన కె.ఎస్.రామారావుగారికి కృతజ్ఞతలు. నిర్మాతగా ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక సాయిధరమ్ తేజ్ ఈ చిత్రంలో ఔట్‌స్టాండింగ్ పెర్‌ఫార్మెన్స్ చేశారు. డాన్సులు, ఫైట్లు అన్నీ ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. ఇక అప్పట్లో తొలిప్రేమ సినిమా ఒక ట్రెండ్ సెట్‌గా నిలిచింది. మళ్లీ అలాంటి చిత్రం చెయ్యడానికే ట్రై చేస్తున్నాను. అన్ని సినిమాలు తొలిప్రేమలా వుండవు. దానిని రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే వుంటాను. అందుకు అందరి సపోర్టు కావాలి. ఈ సినిమాకు గోపీసుందర్ జీనియస్ మ్యూజిక్ డైరెక్టర్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా చేశాడు. అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ఆండ్రూ కెమెరామెన్‌గా పరిచయం అయ్యాడు. అప్పట్నుంచీ నాతో ట్రావెల్ చేస్తున్నాడు. హీరోయిన్ అనుపమ ప్రెష్‌గా కొత్త పెయింటింగ్ వేసినపుడు ఎంత అద్భుతంగా వుంటుందో అనుపమ పరమేశ్వరన్ పెర్‌ఫార్మెన్స్ అంతే అద్భుతంగా ఉంటుంది. బ్యూటీపుల్‌గా క్యారెక్టర్‌లో జీవించి చేసింది. ఫ్యామిలీ అంతా థియేటర్‌కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేయాలి. అదే నా కానె్సప్ట్. తర్వాత నా నెక్స్ట్ ఫిల్మ్ గురించి ఆలోచిస్తాను.

- శ్రీ