రన్‌వే టీజర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హార్ట్‌బీట్, లెటర్ టూ కావ్య, మాణిక్యం ఎంఎంటిఎస్ లాంటి విభిన్నమైన కథనాల లఘు చిత్రాలకు రచన, దర్శకత్వం వహించిన కిరణ్ పాలకుర్తి తాజాగా రన్‌వే అనే షార్ట్ఫిలింకు రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. షార్జాలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ లఘు చిత్రంలో హర్షిత, భాగ్యరాజ్, సనత్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ- ‘‘యువతరం అనుకుంటే ఏదైనా సాధించగలరు. వారి చేతుల్లోనే ఉంటుంది దేశ భవిష్యత్తు. చిత్రసీమలో నిలదొక్కుకోవాలని ఎందరో యువకులు తమకున్న ఆలోచనలకు పదునుపెడుతున్నారు. ఉన్నత లక్ష్యాలతో, ఉన్నత భావాలతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఫలితంగా వారిని విజయాలు వరిస్తున్నాయి. అలాంటి చక్కటి ఆలోచనలు కలిగిన కిరణ్ పాలపర్తి తాజాగా రూపొందించిన రన్‌వే తెలుగు షార్ట్ ఫిలిం కూడా అందర్నీ అలరించడయం ఖాయం. విభిన్నమైన కథనాలతో గతంలో కిరణ్ రూపొందించిన లఘు చిత్రాలు హార్ట్‌బీట్, లెటర్ టూ కావ్య, మాణిక్యం ఎంఎంటిఎస్ అందరి ప్రశంసలను పొందడం ఆనందంగా వుంది. ఈ రన్‌వే కూడా కిరణ్‌కు మంచి పేరును తెచ్చిపెట్టాలి కోరుకుంటున్నాను. ఇలాంటి స్ఫూర్తితోనే కిరణ్ మరిన్ని మంచి చిత్రాలు రూపొందించాలి. మంచి చిత్రాలతో వెండితెరపై వెలగాలి. ఆ దిశగా కిరణ్ అడుగులు పడతాయిని ఆశిస్తున్నాను. ఈ రన్‌వేలో నటించిన నటీనటులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అన్నారు. రచయిత, దర్శకుడు కిరణ్ పాలపర్తి మాట్లాడుతూ- ‘‘గతంలో నేను రూపొందించిన లఘు చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. అదే స్ఫూర్తితో ఈ రన్‌వే షార్ట్ ఫిలింను మీ ముందుకు తీసుకువచ్చాను. ఇకపై మరిన్ని మంచి చిత్రాలను అందించాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు.