సేవకు మరోపేరు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదల గుండె ధైర్యంగా నిలుస్తున్న మనం సైతం మరో ఆపన్నుడిని ఆదుకుంది. డ్రైవర్స్ యూనియన్‌లో పనిచేస్తున్న పి.రాజు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆయన చికిత్స కోసం 3 లక్షల రూపాయలు అవసరం అవుతాయని వైద్యులు చెప్పారు. రాజు దీన పరిస్థితి తెలుసుకున్న కాదంబరి కిరణ్ వెంటనే స్పందించారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ ద్వారా 35 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కాదంబరి కిరణ్ ఆర్థిక సహాయం చేయడంతో ఆగిపోకుండా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి రాజు పరిస్థితిని తీసుకెళ్ళారు. స్పందించిన తలసాని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 55 వేల రూపాయల సహాయం ఇప్పించారు. గురువారం ఈ చెక్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ మారేడుపల్లిలోని తన కార్యాలయంలో కాదంబరి చేతులమీదుగా రాజుకు అందజేశారు. అనంతరం రాజు కాదంబరి కిరణ్‌కు, మంత్రి తలసానికి కృతజ్ఞతలు తెలిపారు.