నిఖిల్ ‘ముద్ర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ముద్ర’ టి.ఎస్.సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొదటిసారి నిఖిల్ సరసన లావణ్యత్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. తాజాగా జరుగుతున్న షెడ్యూల్‌లో నిఖిల్, లావణ్య త్రిపాఠిపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఒక టీవీ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో వెనె్నల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. సినిమాలో కొన్ని సీన్స్ వాస్తవానికి దగ్గరగా ఉండడంతో ఒరిజినల్ లొకేషన్స్‌లో సినిమాను షూట్ చేస్తున్నారు యూనిట్ సభ్యులు. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ముద్ర ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. విభిన్నపాత్రల్లో కనిపించే నిఖిల్ ఈ సినిమాలో రిపోర్టర్ రోల్‌లో నటించారు. సామ్ సి.ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ముద్ర సినిమాను అవురా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మూవీ డైనమిక్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్స్‌పై కావ్య వేణుగోపాల్, రాజుకుమార్ నిర్మిస్తున్నారు. బి.మధు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో.. నిఖిల్ సిద్ధార్థ్, లావణ్యత్రిపాఠి, వెనె్నల కిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోర, సత్య, నాగినీడు తదితరులు నటిస్తున్నారు.