కొత్త అనుభూతి కలిగించే సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటిగా, నిర్మాతగా, టీవీ వ్యాఖ్యాతగా విభిన్న పాత్రలు పోషిస్తూ భిన్నమైన కథలతో సినిమాలు చేస్తోంది మంచు లక్ష్మి. తాజాగా ఆమె వైఫ్ ఆఫ్ రామ్‌గా రాబోతోంది. విజయ్ ఎలకంటి దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఈనెల 20న విడుదల చేస్తున్న సందర్భంగా నటి మంచులక్ష్మి చెప్పిన విశేషాలు... వైఫ్ ఆఫ్ రామ్ తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదు. మంచి థ్రిల్లర్ అని చెప్పాలి. కొత్త ట్రెండ్, జోనర్‌లో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో దీక్ష అనే మహిళగా, ఒక పాపకు తల్లి పాత్రలో కనిపిస్తాను. ఎన్‌జిఓగా పనిచేసే పాత్ర. చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఈ అమ్మాయి సొంత బాబాయ్ దగ్గర పెరుగుతుంది. ఆ తరువాత ప్రేమించి పెళ్లిచేసుకుని హ్యాపీగా ఉండాలనుకొన్న సమయంలో ఆమె జీవితంలో ఏం జరిగింది? అన్నది కథ. ఇంటిలిజెంట్ థ్రిల్లర్. ఊహించని మలుపులతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన సినిమా ఇది. అందుకు తగ్గట్టుగానే ఆమధ్య విడుదల చేసిన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా హిట్ అందుకుంటుంది అని పేర్కొంది.