శ్రీనివాసుడి కల్యాణ గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, రాశీఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. పెళ్లి విశిష్టతను తెలియజెప్పే కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుక పెళ్లి వేడుకను తలపించేలా నటీనటులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ- ఈ కథ గురించి మాట్లాడుతున్నపుడు అందులో మూడు ఇన్సిడెంట్స్ నా లైఫ్‌లో జరిగాయి. అమ్మాయికి పెళ్లి చేశా. మనవడు పుట్టాడని సంతోషించా. భార్య పోయిందని బాధపడ్డా. అవే సతీష్‌తో పంచుకున్నా. శ్రీనివాస కళ్యాణం కథకు రౌండప్ ఐడియా అయ్యింది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగే మూమెంట్స్ ఈ సినిమా. సినిమాలోని ఏదో ఒక పాత్రలో ప్రేక్షకులు తమను తాము చూసుకుంటారు. ఆగస్టు 9న ప్రేక్షకులు ప్రతి ఒక్కరికీ తమ ఇంట్లో పెళ్లి చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది అన్నారు. హీరో నితిన్ మాట్లాడుతూ- గత కొనే్నళ్లుగా మా అమ్మ పెళ్లి పెళ్లి అని అంటోంది. ఇపుడు వద్దు అంటున్న టైమ్‌లో సతీష్ వేగేశ్న కథ చెప్పారు. ఇన్‌స్టెంట్‌గా కనెక్ట్ అయ్యా. పెళ్లి కూడా చేసుకోవాలనే ఫీలింగ్ వచ్చింది. ఆయన చెప్పిన సీన్స్ అంత బ్యూటీఫుల్‌గా ఉన్నాయి అన్నారు. దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ పెళ్లి గురించి చెప్పాలని రాసిన ఒక కథ ఈ శ్రీనివాస కళ్యాణం. పెళ్లి కానె్సప్టు మీద సినిమా చేద్దామని అనుకుంటున్నా, టైటిల్ శ్రీనివాస కళ్యాణం అని రాజుకి, శిరీష్‌కి చెప్పా. తప్పకుండా బావుంటుంది అన్నారు. అక్కడినుంచి పెళ్లి గురించి ఆలోచించడం స్టార్ట్ చేశా. యుగాలు మారినా.. దేవుడు మనిషిగా ఏ అవతారం ఎత్తినా పెళ్లి గొప్పదనం చెబుతూనే ఉన్నాడు. అలా చెప్పాలనే చిన్ని ప్రయత్నమే మా శ్రీనివాస కళ్యాణం. హీరోయిన్ రాశీఖన్నా మాట్లాడుతూ-నా మనసుకు బాగా దగ్గరైన ఈ శ్రీనివాస కళ్యాణం నా కెరీర్‌లోనే బెస్ట్ఫిల్మ్ అన్నారు. ఇంత మంచి కథ, క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడు సతీష్‌కి, దిల్‌రాజుకి థాంక్స్ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ మాట్లాడుతూ- దిల్‌రాజు దగ్గర పని చేసేటప్పుడు ఎప్పుడూ ఒక భయం ఉంటుంది. ఈ సినిమాలో ఫ్రీ మైండ్, కంఫర్టబుల్‌గా చేశా. మంచి కథవల్లే మంచి పాటలు వచ్చాయి అన్నారు. ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ- దిల్‌రాజ, శిరీష్, లక్ష్మణ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. మంచి సినిమాలు ఇస్తూ ఒక గుర్తింపు పొందేటటువంటి మంచి మనసున్న సంస్థ ఇది. అందుకే దిల్‌రాజు అంటే నాకు ఇష్టం అన్నారు. ఇంకా నటుడు రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి జయసుధ, సీనియర్ నటుడు నరేష్, ఆమని, సితారలు ప్రసంగించారు. హీరోయిన్ నందితా శే్వత, పూనమ్‌కౌర్, పాటల రచయితలు రామజోగయ్య శాస్ర్తీ, శ్రీమణి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.