స్పెషల్ సాంగ్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్భలే భలే మగాడివోయ్’ హిట్‌తో దర్శకుడిగా స్టార్ స్టేటస్ కొట్టేసిన మారుతి, ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ పేరుతో ఓ కామెడీ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. వెంకీ స్టైల్లో సరదాగా సాగే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఓ స్పెషల్ సాంగ్‌లో పంజాబీ మోడల్ సోనమ్ భజ్వా కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో సుశాంత్ సరసన ‘ఆటాడుకుందాం రా’ అనే సినిమా చేస్తోన్న సోనమ్, ‘బాబు బంగారం’లో స్పెషల్ సాంగ్‌తో మంచి క్రేజ్ తెచ్చుకోవాలని భావిస్తోందట. గిబ్రాన్ సంగీత దర్శకత్వంలో ఆడియో రికార్డింగ్ ఇపటికే పూర్తయిందని, సోనమ్ త్వరలోనే ఈ పాటను పూర్తి చేయనున్నారని సమాచారం. వెంకీ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో మెప్పించే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

సోనమ్ భజ్వా