ఆ దర్శకుడితో బాలయ్య సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం అన్న ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నాడు బాలయ్య. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఫిలింసిటీలో రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత బాలయ్య ఓవైపు బోయపాటి శ్రీనుతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ఆయనతో సినిమా చేయడానికి మాస్ దర్శకుడు వి.వి.వినాయక్ ప్రయత్నాలు ఎప్పుడో మొదలుపెట్టాడు. ఇప్పటికే కథ విషయంలో వీరిద్దరికి కుదరడం లేదు.. దాంతో ఈ సినిమా విషయంలో బాలయ్య ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదు. దాంతో బాలయ్య వినాయక్‌తో సినిమా లేనట్టే అంటూ వార్తలు కూడా వచ్చాయి.. అయితే తాజాగా ఈ సినిమాకు కథ ఓకే అయిందని.. కథ నచ్చడంతో బాలయ్య కూడా ఓకే చెప్పాడట. ఇదివరకే బాలయ్యతో జైసింహ చిత్రాన్ని తీసిన సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తాడట. ఇప్పటికేస్క్రిప్ట్ పూర్తవడంతో... ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతారట. ఎన్టీఆర్ సినిమా జనవరిలో నేపథ్యంలో ఈ లోగా మరో సినిమా చేయాలనీ బాలయ్య ఈ సినిమాకు ఓకే చెప్పాడట. సో మూడు నెలల్లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే బోయపాటి శ్రీను సినిమా మాత్రం నవంబర్‌లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సో త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.