‘శైలజారెడ్డి అల్లుడు’ తొలి గీతం విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాతలు నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం నిర్మాణం పూర్తయింది. ఈనెల 31న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం తొలి గీతం ‘అను బేబీ’ ఈరోజు ఉదయం 10 గంటలకు ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ద్వారా విడుదలయింది. ఈ గీతాన్ని కృష్ణకాంత్ రచించగా, అనుదీప్‌దేవ్ పాడారు. శేఖర్ వి.జె. నృత్య దర్శకత్వం వహించారు. ఆడియో విడుదల తేదీ, ఇతర వివరాలు త్వరలోనే తెలియపరుస్తామని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు. దాసరి అరుణ్‌కుమార్, గిరిబాబు, నరేష్, మురళీశర్మ, వెనె్నల కిషోర్, రఘుబాబు, పృథ్వి, మధునందన్, శత్రు, కళ్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: గోపీసుందర్, కెమెరా: నిజార్ షఫీ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు: నాగవంశీ, పి.డ.వి.ప్రసాద్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ (చినబాబు), రచన- దర్శకత్వం: మారుతి.