సినిమారంగానికి బడ్జెట్‌లో వట్టిచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ప్రత్యేకంగా సిని మా పరిశ్రమ అభివృద్ధికి పైసా కూడా కేటాయించకపోవడం నిరాశాజనకంగా వుందని తెలంగాణ సిని మా ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధి రఫి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభు త్వం అమల్లోకి వచ్చా క ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫి మంత్రి, ప్రభుత్వ సలహాదారులను స్వయంగా కలిసి తమ డిమాండ్లను సమర్పించినపుడు త్వరలో చర్చించి అన్ని డిమాండ్లను అమలుచేస్తామని హామీ ఇచ్చారని, అందుకోసం నిధులు కేటాయిస్తారని తాము భావించామని ఆయన తెలిపారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలపై దృష్టి సారించినట్లుగా సినిమా పరిశ్రమను పట్టించుకోవడం లేదన్న విషయం అర్థమవుతోందని, థియేటర్ రెంట్లు వసూలు చేసి తమ పొట్ట కొట్టే వారిపై చర్య తీసుకోవాలని, తెలంగాణా రాష్ట్రానికి చెందిన కళాకారులతో రూపొందించిన సినిమాలపై పన్ను మాఫీలు, సబ్సిడీలు ప్రకటిస్తారన్న ఆశతో తాము ఎదురుచూస్తున్నామని, అలాగే సింగిల్ విండో పద్ధతిలో అనుమతులిచ్చి, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రుణ సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా మానిఫెస్టోలో వున్న హామీలన్నీ నెరవేర్చాలని ఆయన కోరారు.