కన్నుల పండువగా షార్ట్ ఫిలిం అవార్డ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచం సినీ క్రియేషన్స్, కాచం ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన షార్ట్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమం ఆదివారం రాత్రి ప్రసాద్‌ల్యాబ్స్‌లో కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, నిర్మాత రాజ్ కందుకూరి, సినీ గేయరచయిత చంద్రబోస్, ఆర్‌ఎక్స్100 ఫేం హీరో కార్తికేయరెడ్డి, ప్రతాని రామకృష్ణగౌడ్, తెలంగాణ రాష్ట్ర జలసంరక్షణ, అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాశ్‌రావ్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, నిర్మాత రాంబాబు తదితరులు హాజరయ్యారు. కాచం సినీ క్రియేషన్స్, కాచం ఫౌండేషన్ చైర్మన్ డా.కాచం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి 220 షార్ట్ఫిల్మ్ నామినేషన్స్ రాగా, అందులో ఉత్తమహీరో, ఉత్తమ హీరోయిన్, ఉత్తమ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, ఉత్తమ దర్శకులుగా ఎన్నికైన కళాకారులకు ఐదువేల నగదుతోపాటు, మెమొంటోతో సత్కరించారు. దీంతో పాటు వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మందిని వెయ్యి రూపాయల నగదు పురస్కారంతో సత్కరించారు. అలాగే 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 72మంది నూతన దర్శకులను కూడా సత్కరించడం ద్వారా ఒకే వేదికపై నూతన షార్ట్ఫిలిం డైరెక్టర్‌లను సత్కరించిన కార్యక్రమంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది.