తెలుగు నేర్చుకుంటాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారా రోహిత్ మరియు జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆటగాళ్ళు’ ఈనెల 24న విడుదల కాబోతున్న సందర్భంగా ఈ చిత్ర హీరోయిన్ దర్శన బానిక్ మీడియాతో మాట్లాడారు.
* మీ గురించి చెప్పండి?
-మాది కొలకత్తా. నేను మోడల్‌గా చేశాను. అలాగే బెంగాలీలో ఆరు సినిమాల్లో నటించాను. మరియు ఓ బెంగాలీ వెబ్ సిరీస్‌లో కూడా యాక్ట్ చేశాను. సినిమాలు నాకు కొత్త కాదు గాని, తెలుగులో మాత్రం ఇదే నా మొదటి చిత్రం.
* ‘ఆటగాళ్లు’ చిత్రంలో మీకు హీరోయిన్‌గా ఎలా అవకాశం వచ్చింది?
-నేను మోడలింగ్ చేసే ప్రాసెస్‌లో లాస్ట్ ఇయర్ బాంబేలో ఓ మ్యూజిక్ వీడియోలో యాక్ట్ చేశాను. ఆ వీడియో కొరియోగ్రాఫర్ విష్ణుదేవా. ఆయనే నా ఫొటోషూట్ పిక్స్‌ని ఈ చిత్ర దర్శక నిర్మాతలకి సెండ్ చేసారు. ఆ తర్వాత నేను ఆడషన్స్‌కి వచ్చాను. ఆడిషన్స్ మొత్తం సిక్స్ రౌండ్స్ జరిగాయి. సినిమాలో కొన్ని టఫ్ సీన్స్‌లో యాక్ట్ చేసాక, రోహిత్‌తో ఫొటోషూట్ చేసి చూశాక ఈ పాత్రకు నేను సరిపోతానని నన్ను సెలక్ట్ చెయ్యడం జరిగింది.
*ఈ చిత్రం ట్రైలర్, ప్రోమోలు చూస్తుంటే ఇది ఒక మైండ్ గేమ్ మూవీలా అనిపిస్తోంది.
మరి మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
-ఈ సినిమాలో నా పాత్ర పేరు అంజలి. సింపుల్‌గా చెప్పాలంటే తను చాలా ఇండిపెండెంట్ మరియు వర్కింగ్ లేడి. సినిమాలోని హీరో పాత్రను సిన్సియర్‌గా లవ్ చేస్తోంది. అతనే్న పెళ్లిచేసుకోవాలని కోరుకుంటుంది. వన్ వర్డ్‌లో చెప్తే ఆటగాళ్లు చిత్రంలోని ‘అంజలి’ ఓ సిన్సియర్ ప్రేమికురాలు.
* మొదటిసారి తెలుగు సినిమాలో నటించారు. ఈ సినిమాలో నటించే ముందు మీరు తెలుగు సినిమాలు ఏమైనా చూసారా?
-తెలుగు సినిమాలు బెంగాలీలోకి డబ్ అవుతాయి. అలా తెలుగు సినిమాలు చూడటం జరిగింది. ముఖ్యంగా మగధీర, ఆర్య, ధృవ, అరుంధతి, బాహుబలి సిరీస్ ఇలా అన్ని చూసాను. నాకు ‘బాహుబలి’ మూవీ చాలా బాగా నచ్చింది.
* తెలుగు సినిమాలకి, బెంగాలీ సినిమాలకి ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి?
-పెద్దగా వ్యత్యాసంఅంటూ ఏమీ ఉండదు. ఎక్కడైనా కష్టపడే పనిచెయ్యాలి. ఫ్యాషన్‌తోనే నటించాలి. కో ఆర్టిస్ట్‌లతో యూనిట్‌తో కోఆర్డినేషన్ బాగుండాలి. రెండు సినీ పరిశ్రమల్లో ఒకేలా ఉంటుంది పని. కాకపోతే తెలుగు సినిమాల బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది. బెంగాలీ సినిమాల బడ్జెట్ తెలుగు సినిమాలతో పోల్చుకుంటే కాస్త తక్కువగా ఉంటుంది. అంతే తేడా.
* మరి ఈ చిత్రంలో మీతోపాటు నటించిన నారా రోహిత్, జగపతిబాబు గురించి చెప్పండి?
-నాకు షూట్‌లో వాళ్ళు చాలా బాగా సహకరించారు. ఇక ఈ సినిమాలో నారా రోహిత్, జగపతిబాబు పాత్రలు హైలెట్‌గా ఉంటాయి. ఇద్దరూ పోటీపడి మరీ నటించారు. వారి మధ్య సాగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మా డైరెక్టర్ పరుచూరి మురళిగారు ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు.
* తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. మరి తెలుగులో స్పష్టంగా ఎప్పుడు మాట్లాడతారు?
-నేను తెలుగు అర్ధం చేసుకోగలను, కానీ మాట్లాడలేను. తెలుగు నేర్చుకుంటాను. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడతాను.
* మీకు ఇష్టమైన హీరో ఎవరు?
- బాలీవుడ్‌లో అయితే షారుఖాన్. ఆయన సినిమాలన్నీ చూస్తాను. ఇక తెలుగులో ఇష్టమైన హీరోలు అంటే.. ప్రభాస్. బాహుబలి సినిమా చూసి నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అలాగే అల్లు అర్జున్ అన్నా కూడా నాకు చాలా బాగా ఇష్టం. డైరెక్టర్‌ల్లో రాజవౌళికి నేను పెద్ద అభిమానిని.
* మీ తదుపరి చిత్రం?
- త్వరలోనే చెబుతా. కొన్ని కథలు వింటున్నాను.

- శ్రీ