లారెన్స్‌తో అనుష్క?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుష్క- ప్రభాస్ జంటగా గతంలో లారెన్స్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైంది. కొంత చిత్రీకరణ పూర్తయ్యేక అనుష్క అనివార్య కారణాలవల్ల ఆ చిత్రం నుండి తప్పుకుంది. ఆ తరువాత లారెన్స్ ఆమె స్థానంలో ఇద్దరు కథానాయికలను బుక్ చేసి మరీ సినిమాను పూర్తిచేశాడు. దీనివెనుక ఏం జరిగిందో కానీ మొత్తానికి అనుష్క-లారెన్స్‌లమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వెళ్ళారు. అదంతా గతం! ఇప్పుడు తాజాగా లారెన్స్‌తో అనుష్క ఓ చిత్రంలో నటిస్తోందన్నమాట వినిపిస్తోంది. కన్నడంలో విజయవంతమైన ‘శివలింగ’ అనే హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టుకోసం రెండు భాషల్లో చిరపరిచితమైన నటుల కోసం వెదుకుతున్నాడు. అందులో భాగంగా హారర్ జోనర్స్ అంటే గుర్తొచ్చే ఈ ఇద్దరు కనిపించారు. ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, జేజమ్మ లారెన్స్‌తో నటిస్తోందా లేదా అన్న విషయం కొన్నాళ్ళైతే గానీ తెలియదు.