అమర్ అక్బర్ ఆంటోనీ ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. రవితేజ, ఇలియానా ఇందులో జంటగా నటిస్తున్నారు. ఈ ఫస్ట్‌లుక్‌లో హీరో పాత్రను మూడు భిన్నమైన గెటప్స్‌లో చూపించారు. ఫస్ట్‌లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. రవితేజ కూడా తొలిసారి తన కెరీర్‌లో ఇలా భిన్నమైన కోణాలున్న పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనువైట్ల తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా.. సరికొత్త జోనర్‌లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్, లయ, వెనె్నల కిషోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షెడ్యూల్ అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతుంది. సెప్టెంబర్‌లో షూటింగ్ పూర్తికానుంది. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. విజయ్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీమేకర్స్ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ విడుదల కానుంది. రవితేజ, ఇలియానా డీక్రూజ్, సునీల్, లయ, వెనె్నల కిషోర్, రవిప్రకాశ్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యుసింగ్, విక్రమ్‌జిత్, రాజ్‌వీర్‌సింగ్, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకుడు: శ్రీనువైట్ల, నిర్మాతలు: నవీన్ యేర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సివిఎమ్), సహ నిర్మాత: ప్రవీణ్ మర్పూరి, సీఈఓ: చెర్రీ, సినిమాటోగ్రఫీ: విజయ్ సి.దిలీప్, ఎడిటర్: ఎంఆర్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్ థమన్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్, పాటలు: రామజోగయ్యశాస్ర్తీ.