నేనెవరికీ బాకీ లేను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జై, రష్మీ గౌతమ్ జంటగా యు అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ఎస్‌జై ఫిలింస్ పతాకంపై జానీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అంతకు మించి’. ఈ చిత్రం గత శుక్రవారం 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదలైంది. అయితే ‘అంతకుమించి’ చిత్రానికి తాను నిర్మాతననీ, అంతేకాకుండా హీరో జై తనవద్ద 50 లక్షలు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించలేదని, కాబట్టి సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కృష్ణ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ‘అంతకుమించి’ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించిన కోర్టు హీరో జైకు నోటీసులు జారీ చేసింది. దీనిపై హీరో జై స్పందిస్తూ.. కృష్ణ అనే అతను మొదట ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు అయితే ఎవరికీ ఏ అడ్వాన్సులు కూడా ఇవ్వకుండా మీడిల్ డ్రాప్ అయ్యాడు. దాంతో సినిమా భారం నాపై పడింది. నేను స్వయంగా కష్టపడి ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి మరీ ఈ సినిమా చేసాను. అందరి దగ్గరనుంచి క్లియరెన్స్ తెచ్చుకున్న తరువాతే సినిమాను 24న 300 థియేటర్లలో విడుదల చేసాను. హిట్ టాక్ రావడంతో భరించలేక కృష్ణ అనే వ్యక్తి కావాలనే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి నా సైన్‌ను కూడా ఫోర్జరీ చేసి కోర్టులో స్టే తెచ్చాడు. ఇప్పుడు ఆ విషయంపై అసలు డాక్యుమెంట్స్‌తో నేను కోర్ట్‌లో సబ్మిట్ చేసి క్లియరెన్స్ తెచ్చుకున్నాను. సినిమాను ప్రదర్శించవచ్చు అని కోర్ట్ తెలిపింది. దానికి సంబంధించిన కాపీ మంగళవారం కోర్ట్ నుండి వస్తుంది.. అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే లాయర్ పి.రాజేష్‌బాబు, రాజు బాల, మదన్, కన్నా, లక్ష్మీనారాయణ, మోహన్‌గాంధీ తదితరులు హీరో కమ్ నిర్మాత అయిన జైకు మద్దతుగా నిలిచి వారిని ఆవేదనను తెలియపరిచారు.