సీతయ్య.. ఎవరి మాటా వినడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటుడు, మహా రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి తనయుడు నందమూరి తారక రామారావు వారసుడిగా అటు రాజకీయాల్లో.. ఇటు సినిమా రంగంలో తనదైన ప్రత్యేకతను చాటి చెప్పాడు నందమూరి హరికృష్ణ. ఆయన 1956 సెప్టెంబరు 2న జన్మించారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. నందమూరి తారకరామారావు మూడవ కుమారుడు. తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతనికి ఇద్దరు భార్యలు లక్ష్మి, షాలిని, కుమారులు జానకిరామ్ (ఈమధ్యే మరణించారు), కళ్యాణ్‌రామ్ మరియు జూనియర్ ఎన్‌టిఆర్, కూతురు వసుంధర. ఇద్దరు కుమారులు టాలీవుడ్‌లో హీరోలుగా ప్రసిద్ధి చెందారు. హరికృష్ణ నేటి ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగే ఒక వివాహానికి హాజరయ్యేందుకు హరికృష్ణ స్వయంగా కారును డ్రైవ్ చేస్తూ తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరారు. నల్లగొండ జిల్లా అనె్నపర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో 29న ఆయన మరణించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా హరికృష్ణ రాజీనామా చేశాడు. తన రాజ్యసభ సభ్యత్వానికి (22-08-2013) రాజీనామా సమర్పించారు. సమైక్య రాష్ట్రం కోసం త్వరలో రాష్ట్ర పర్యటన చేయబోతున్నట్టు తెలిపారు. రాజ్యసభ చైర్మన్‌కు స్వయంగా తన రాజీనామా లేఖను అందించారు. హరికృష్ణ సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
సినిమాల్లో..
హరికృష్ణ మొట్టమొదటిసారి బాలనటుడిగా 1967లో శ్రీకృష్ణావతారంలో బాలకృష్ణుడు పాత్రలో నటించాడు. ఆ తరువాత బాలనటుడిగా 1970లో తల్లా పెళ్ళామా, 1974లో తాతమ్మకలతో నటుడిగా ఎదిగాడు. అయితే మోహన్‌బాబుతో కలిసి 1998లో ఆయన చేసిన శ్రీరాములయ్యలో సత్యం పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత నాగార్జునతో కలిసి 1999లో సీతారామరాజు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత 2002లో లాహిరి లాహిరి లాహిరిలో, 2002లో శివరామరాజు చిత్రాలతో స్టార్‌గా ఎదిగారు. అయితే సోలో హీరోగా 2003లో వచ్చిన సీతయ్య సినిమాతో సత్తా చాటాడు. ‘ఎవ్వరి మాట వినడు సీతయ్య’ అంటూ నందమూరి అభిమానుల్లో ఆయన సరికొత్త ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత టైగర్ హరిశ్చంద్రప్రసాద్, 2004లో స్వామి, 2005లో శ్రావణమాసం చిత్రాల్లో నటించారు. శ్రావణమాసం సినిమా తరువాత ఆయన సినిమాలపై దృష్టిపెట్టలేదు
సంతాపం తెలిపిన ప్రముఖులు
సినీ హీరో, టిడిపి సీనియర్ నేత, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ (61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. హరికృష్ణగారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయగా, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరుతూ సంతాపం ప్రకటించారు. హరికృష్ణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
అక్కినేని నాగార్జున హరికృష్ణతో తన చివరి సంభాషణ గురించి ట్విట్టర్‌లో తెలియజేస్తూ- కొన్ని వారాలక్రితమే హరికృష్ణ నాతో ‘‘నిన్నుచూసి చాలా రోజులు అయింది తమ్ముడు.. నిన్ను కలవాలి తమ్ముడు’’ అని అన్నారని తెలుపుతూ.. మిస్ యూ అన్నా అంటూ నాగార్జున తన సంతాపాన్ని తెలిపారు. అలాగే మిగిలిన సినీ ప్రముఖులు కూడా హరికృష్ణ మృతిపట్ల తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ విషాద సంఘటన విన్న వెంటనే షాక్‌కు గురయ్యాను. నాకు ఇప్పుడు మాటలు రావడంలేదు. దేవుడు నిజంగా చాలా కఠినమైనవాడు. నందమూరి హరికృష్ణగారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను
అన్నారు మంచు మనోజ్.
ఈ ఉదయం నిద్రలేవగానే ఇంత ఘోరమైన విషాద వార్త వినాల్సిరావడం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ విషాదాన్ని అధిగమించడానికి తారక్, కళ్యాణ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నాను అన్నారు సుధీర్‌బాబు. నందమూరి హరికృష్ణ గారి మరణవార్త నన్ను షాక్‌కు గురిచేసింది. ఆయన చాలా గొప్ప మనసున్న వ్యక్తి. కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ఎంతో బాధను వ్యక్తం చేశారు అల్లరి నరేష్.
నందమూరి హరికృష్ణగారి గురించి ఇలాంటి దురదృష్టకరమైన వార్త వినడం నమ్మలేకపోతున్నాను. చాలా గొప్ప వ్యక్తి. నాకు, నా తండ్రికి ఆయన చాలా ఆప్తుడు. ఆ భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంతాపాన్ని ప్రకటించారు. ఈ వార్త నన్ను చాలా షాక్‌కు గురిచేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను అంటూ మంచు లక్ష్మి తన సంతాపాన్ని తెలిపారు. ఈ వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. ఆయన మృతి నందమూరి కుటుంబానికి తీరని లోటు. ఆయన మంచి వ్యక్తి, గొప్ప తండ్రి. నా బాధను వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదు. ఇది విషాదకరమైన రోజు అన్నారు రచయత కోన వెంకట్. నటుడు, తెలుగుదేశం నేత నందమూరి హరికృష్ణ మరణం నందమూరి అభిమానులను, టిడిపి శ్రేణులకు తీరని లోటు అని డా.రాజశేఖర్, జీవిత తమ సంతాపాన్ని తెలిపారు. వారు మాట్లాడుతూ- హరికృష్ణగారు మా కుటుంబంలోని వ్యక్తి. మా ఇంట్లో జరిగే కార్యక్రమాలకు హాజరై ప్రత్యేక అభిమానంతో పలకరించేవారు. ఎంతో మనోబలాన్ని అందించేవారు. అటువంటి వ్యక్తి నేడు మన మధ్య లేరంటే జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. చాలా బాధగా ఉంది. ఆయన్ను మిస్ అవుతున్నాం. ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ సహా ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలి. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం అన్నారు