శివ దర్శకత్వంలో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ తదుపరి సినిమాపై ఇప్పటికే మెగా అభిమానుల్లో సందిగ్ధం నెలకొంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న నా పేరు సూర్య భారీ ఫ్లాప్ అవ్వడంతో ఆయన తదుపరి సినిమా విషయంలో ఎక్కువ కేర్ తీసుకున్నాడు. ఇప్పటికే మనం ఫేమ్ విక్రమ్ కుమార్‌తో సినిమాకు రెడీ అయ్యాడు. దాంతోపాటు అల్లు అర్జున్ మరో సినిమాకు ఓకె చెప్పాడట. అయితే ఈసారి ఆయన తెలుగు, తమిళ భాషల్లో నటించే సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞాన్‌వేల్ రాజా నిర్మిస్తాడట. శివ దర్శకత్వం వహిస్తాడని తెలిసింది. శివ ప్రస్తుతం అజిత్ హీరోగా విశ్వాసం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇదివరకే అజిత్‌తో వీరం, వేదాలమ్, వివేకం సినిమాలను తెరకెక్కించాడు. మాస్ దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న శివ, గోపీచంద్‌తో శౌర్యం సినిమాతో దర్శకుడిగా మారాడు. సో.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రానుంది.