అర్జునుడిగా ప్రభాస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ ప్రస్తుతం ‘మహాభారతం 3డి’ సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో కలిసి అమీర్‌ఖాన్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మూడు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమా కోసం ఏకంగా పదేళ్లు కేటాయించాల్సి ఉంటుందని తన అంచనాని వెల్లడించాడు. అయితే ఇటీవల ఈ సినిమా గురించి సరైన అప్‌డేట్ లేకపోవడంతో అందరిలో ఒకటే సందేహాలు. అసలు అమీర్ మహాభారతం చిత్రాన్ని తెరకెక్కిస్తారా? అంటూ డౌట్స్ వచ్చాయి. అసలే పురాణేతిహాసాల్ని టచ్ చేస్తే ఎట్నుంచి ఏ సమస్య వస్తుందోనన్న సందేహాల్ని వ్యక్తం చేశారు. పద్మావత్ తరహాలో చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు హెచ్చరించిన నేపథ్యంలో అమీర్‌ఖాన్ వెనుకంజ వేశారని చెప్పుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. అమీర్ ఖాన్ తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్, అమితాబ్, దీపిక పదుకొనె వంటి స్టార్లను నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీపిక ద్రౌపది పాత్రలో నటిస్తుందని, అలానే అమీర్ కృష్ణుడిగా నటిస్తే, సౌత్ సూపర్‌స్టార్ ప్రభాస్ అర్జునుడిగా నటిస్తాడని ప్రచారమవుతోంది. అర్జునుడి పాత్ర కోసం అమీర్‌ఖాన్ ఇప్పటికే ప్రభాస్‌ని సంప్రదించారని ప్రముఖ బాలీవుడ్ వెబ్‌సైట్ పేర్కొంది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ కెరీర్‌కి మరో క్రేజీ మూవీ దక్కినట్టే. ఇది అతడి స్టామినాని జాతీయ స్థాయిలో ఎలివేట్ చేస్తుందనడంలో సందేహమే లేదు. సాహూ తర్వాత వెంటనే ఆ కమిట్‌మెంట్‌ని కుదుర్చుకునే ఛాన్సుంటుందేమో! మరోవైపు.. అమీర్ స్వయంగా నటించి, నిర్మించిన ‘్థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ నవంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. మహాభారతం పనుల్లో అమీర్‌ఖాన్ బిజీ అవుతారని చెబుతున్నారు.