ఏప్రిల్ నుండి నాని చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే ‘్భలేభలే మగాడివోయ్’ సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న యువ హీరో నాని ప్రస్తుతం పలు సినిమాలతో జోరుమీదున్నాడు. ఇప్పటికే ఆయన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత నాని తదుపరి చిత్రం ఖరారైంది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ నుండి సెట్స్‌పైకి రానుంది. ఇందులో హీరోయిన్‌గా మలయాళీ ముద్దుగుమ్మ అనూ ఎమాన్యుయల్ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.