6న నోటా ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌దేవరకొండ మరో సినిమాతో వస్తున్నాడు. ఈయన నటిస్తున్న ద్విభాషా చిత్రం నోటా విడుదలకు సిద్ధమైంది. ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు తన కెరీర్‌లో చేయనటువంటి భిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. మెహ్రీన్ కౌర్ ఇందులో విజయ్‌కు జోడీగా నటిస్తోంది. సత్యరాజ్, నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న నోటా చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర థియెట్రికల్ ట్రైలర్ ఈనెల 6 సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. విజయ్ దేవరకొండ, మెహ్రీన్, సత్యరాజ్, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: షాన్ కరుప్పుస్వామి, సంగీతం: శ్యామ్ సిఎస్, సినిమాటోగ్రఫీ: శాంతన కృష్ణన్, ఎడిటర్: రేమాండ్ డెరిక్ క్రాస్టా, ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్కే కిరణ్, కొరియోగ్రఫీ: బృందా, నిర్మాణ సంస్థ: స్టూడియో గ్రీన్, నిర్మాత: కె.ఈ.జ్ఞానవేల్ రాజా, దర్శకత్వం: ఆనంద్ శంకర్.