అరవింద పాటలు వస్తున్నాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆడియో విడుదలకు ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం. ఈనెల 20న ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను ఘనంగా జరపనున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆల్బమ్‌పై మంచి అంచనాలు వున్నాయి. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మొదటిసారి చిత్తూరు యాసలో డైలాగులు చెప్పనున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా, సునీల్ కమెడియన్ పాత్రలో నటిస్తున్నారు. హాసిని హారిక క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మొదటిసారి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.