21న నన్ను దోచుకుందువటె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్‌బాబు హీరోగా, సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయవౌతున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటె.’ టీజర్‌తో సెనే్సషన్ క్రియేట్ చేశారు. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా యూత్‌కి బాగా కనెక్ట్‌అయ్యింది. సినిమా కానె్సప్ట్ డిఫరెంట్‌గా ఉండడం.. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ.. సుధీర్‌బాబు హీరోగా సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తున్న ‘నన్ను దోచుకుందువటె’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మేం ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుందని ఆశించామో అంతకుమించిన క్రేజ్ వచ్చింది. మా టీం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్‌కి అందరూ కనెక్ట్‌అయ్యారు. సమ్మోహనం లాంటి మంచి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత వస్తున్న చిత్రం కావటంతో ప్రేక్షకులనుంచి అంచనాలు భారీగా వున్నాయి. సుధీర్‌బాబుగారు ఫస్ట్‌ప్రొడక్షన్‌లో నన్ను నమ్మి, నా కథను నమ్మి అవకాశం ఇచ్చారు. సమ్మోహనం సూపర్ హిట్ అయిన తర్వాత నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సుధీర్‌బాబుగారికి స్పెషల్‌గా థాంక్స్ తెలియజేస్తున్నాను. సినిమామీదున్న నమ్మకంతో ప్రమోషన్‌ను కూడా భారీగా ప్లాన్‌చేశాం అన్నారు.