27న ‘నవాబ్’ల ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ మణిరత్నం. ఈయన డైరెక్షన్‌లో రూపొందిన భారీ మల్టీస్టారర్ ‘నవాబ్’. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో అరవిందస్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, ఐశ్వర్యరాకేశ్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్‌రాజ్, త్యాగరాజన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘నవాబ్ సినిమాను ఈనెల 27న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. ముందుగా ఈనెల 28న విడుదల చేయాలనుకున్నప్పటికీ.. తాజాగా ఓరోజు ముందుగానే అంటే ఈనెల 27నే సినిమాను విడుదల చేయబోతున్నాం. రీసెంట్‌గా విడుదలచేసిన ట్రైలర్‌కు ప్రేక్షకులనుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మణిరత్నంగారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవాబ్ మంచి యాక్షన్ ఫ్యాక్‌డ్ మూవీ. ఎమోషనల్ కంటెంట్‌తో సాగే చిత్రమిది. అరవిందస్వామి, జ్యోతిక, అరుణ్‌విజయ్, ఐశ్వర్యరాజేశ్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్‌రాజ్ వంటి భారీ తారాగణంతో, ఎ.ఆర్.రెహమాన్, సంతోశ్ శివన్, శ్రీకర్‌ప్రసాద్, సిరివెనె్నల సీతారామశాస్ర్తీ వంటి టాప్ టెక్నీషియన్స్ సహకారంతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.