పాటల్లో అలా జరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌కుమార్, మంజీర జంటగా వెల్లంకి దుర్గాప్రసాద్ దర్శకత్వంలో ఎవర్‌గ్రీన్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రవికుమార్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘అలా జరిగింది’. ఈ చిత్రంలోని పాటలు బుధవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. నిర్మాత సాయి వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొని టీజర్‌ను, పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.అనసూయాదేవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ- ప్రేమ, సస్పెన్స్, సెంటిమెంట్, యాక్షన్ ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది. నిత్య జీవితంలో అలా జరిగింది అని చెప్పుకునే మాటలు చాలా వింటున్నాం. కథ ప్రకారం ఈ టైటిల్‌ను పెట్టడం జరిగింది. సాయం చేయబోయిన హీరో ఓ ఆరోపణకు గురైనపుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అతను ఏం చేశాడన్నదే ఈ కథ. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇందులో నేను కూడా ఓ మంచి పాత్ర పోషించాను అన్నారు. సాయి వెంకట్ మాట్లాడుతూ- అలా మొదలైంది తరహాలో ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- సినిమా పూర్తికావచ్చింది. తప్పకుండా ఆడియో మంచి హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. మంచి చిత్రాల్ని ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:వి.డి.పి, సంగీతం:ఆర్మాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.అనసూయాదేవి.