అందరి మనసు దోచుకుంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్‌బాబు, నభా నటేష్ జంటగా సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. మొదటిసారి సుధీర్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 21న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు ఎస్.ఆర్.నాయుడు చెప్పిన విశేషాలు... ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్‌గా మారుతోంది. యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ఇప్పటివరకూ ఈ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో వున్న కొత్తదనం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. సుధీర్‌బాబు సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజర్‌గా భిన్నమైన శైలిలో ఉంటాడు. హీరోయిన్ చాలా చలాకీ అమ్మాయి. అలాంటి అబ్బాయి జీవితంలోకి ఈ అమ్మాయి ఎంట్రీ అయితే ఎలా ఉంటుంది అనేది సినిమా. దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. ఇంటర్మీడియెట్ నుంచి దర్శకుడు అవ్వాలనే కోరిక. దాంతో రామానాయుడు ఫిలిం స్కూల్లో దర్శకత్వ శాఖలో శిక్షణ తీసుకున్నాను. ఆ తరువాత నీ మాయలో అన్న షార్ట్ ఫిలిం చేశాను. ఆ తరువాత స్పందన అనే మరో షార్ట్ ఫిలిం చేశాను. మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. అక్కడే ప్రతి సినిమాను చూసేవాడిని. అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక మనం ఊహించిన పరిస్థితులకు ఇక్కడ భిన్నంగా ఉంటాయని తెలుసుకున్నాను. ఈ కథను చాలామందికి చెప్పాను. ముఖ్యంగా ఓ నిర్మాతకు కథ నచ్చడంతో చేద్దామని ముందుకువచ్చాడు. అపుడే సుధీర్‌బాబును కలవడం జరిగింది. ఆయన నేను చేసిన స్పందన షార్ట్ఫిలిం చూసి నాకు ఈ అవకాశం ఇచ్చాడు. కథ నచ్చడంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఆ తరువాత నాకు నిర్మాతకు కుదరలేదు. దాంతో ఈ సినిమాని సుధీర్‌బాబు సొంత బ్యానర్‌లో నిర్మించాడు. ఈ సినిమాలో కథ ప్రకారం కొత్త హీరోయిన్ కావాలి. అందుకోసం ఆడిషన్ చేసి నభా నటేష్‌ను ఎంపిక చేశాం. తను బాగా చేసింది. అన్నిరకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమాకు మ్యూజిక్, ఫొటోగ్రఫి హైలెట్‌గా నిలుస్తాయి. పక్కా స్క్రీన్‌ప్లేతో సాగిన ఈ సినిమాపై మంచి నమ్మకముంది. ఈ సినిమా తరువాత ఓ కథ సిద్ధంగా ఉంది. త్వరలోనే దాని గురించి తెలియజేస్తా.