బిత్తిరి సత్తి తుపాకీ రాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ పాపులర్ యాంకర్, నటుడు బిత్తిరి సత్తి కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం తుపాకీ రాముడు. బతుకమ్మ ఫేమ్, సీనియర్ దర్శకులు టి.ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి ఫిల్మ్స్ పతాకంపై రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తిచేసుకుని, శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. బిత్తిరి సత్తిగా అందరికీ పరిచయమైన సత్తి, తుపాకీరాముడు చిత్రంలో మరో కోణంలో కనిపిస్తున్నారు. ఈ సినిమా సత్తికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. అలాగే దర్శకుడు ప్రభాకర్ ఈ చిత్రాన్ని ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించి ఉంటారని ఆశిస్తున్నాను అన్నారు. చిత్ర దర్శకుడు టి.ప్రభాకర్ మాట్లాడుతూ- యూనివర్సల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు పుష్కలంగా ఉంటాయి. బిత్తిరి సత్తిని ఈ చిత్రంలో వైవిధ్య కోణంలో చూపిస్తున్నాము. రసమయి బాలకిషన్ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాకి సహకరించారు. పూర్తి వినోదాత్మకంగా ఉండబోతోన్న ఈ చిత్రం ప్రేక్షకులందరినీ తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది అన్నారు. నిర్మాత రసమయి బాలకిషన్ మాట్లాడుతూ- సినిమా అంతా ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. సత్తికి మంచి పేరునే కాకుండా బిజి నటుడిని చేస్తుంది. ఇంకా రెండు పాటలు చిత్రీకరణ జరపాల్సి ఉంది. నిర్మాణానంతర కార్యక్రమాలు దాదాపు చివరికి వచ్చాయి.