అబ్బాయితో అమ్మాయికి మాస్ట్రో బ్లెస్సింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, పలక్ లల్వాని జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రం -అబ్బాయితో అమ్మాయి. వందన అలేఖ్య జక్కం, శ్రీనివాస్ సమ్మెట, కిరీటి పోతిని నిర్మాతలు. చిత్రం కోసం స్వయంగా స్వరపర్చిన పాటల్ని హైదరాబాద్‌లో మాస్ట్రో ఇళయరాజా ఆవిష్కరించారు. ఈ సదర్భంగా మాట్లాడుతూ అందరూ ప్రేమికులే. నాకు సంగీతమంటే ప్రేమ. కొంతమందికి డబ్బంటే ప్రేమ. ప్రేమ లేకపోతే జీవితం లేదు. అలాంటి ప్రేమను మెయిన్ థీమ్‌గా పెట్టుకొని రమేశ్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందించాడు. టీం అందరికి ఆల్ ది బెస్ట్ అన్నారు. దర్శకుడు రమేశ్ వర్మ మాట్లాడుతూ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా సినిమా ఉంటుంది. నాగశౌర్య, పలక్ చక్కగా నటించారు. స్క్రిప్ట్ నచ్చడంతో మ్యూజిక్ అందించేందుకు ఇళయరాజా అంగీకరించారు. చిత్రానికి సపోర్టు చేసిన అందరికీ థాంక్స్ అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ట్రైలర్‌కు, పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని, క్రిస్మస్ కాన్కగా డిసెంబర్ 25న చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ ఇళయరాజా గురించి మాట్లాడే వయసు నాకు లేదు. వెయ్యి సినిమాలకు దగ్గరవుతున్నారు. నా కెరీర్ మొదట్లోనే ఆయనతో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. దర్శకుడు రమేశ్ వర్మతో మూడేళ్ల క్రితమే సినిమా చేయాల్సింది. కానీ కుదరలేదు. ఇప్పటికి కుదిరింది. టెక్నీషియన్స్ కష్టం సినిమాలో కనిపిస్తుంది. చిత్రం హిట్టుకావాలి అన్నారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ మంచి టెక్నీషియన్స్ పెట్టుకొని రమేశ్ వర్మ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఫొటోగ్రఫీ బావుంది. ఇళయరాజా మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రమేశ్‌కు సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.
కార్యక్రమంలో ఆర్‌పి పట్నాయక్, సునీత, లగడపాటి శ్రీ్ధర్, సి కళ్యాణ్, గౌతమ్, తుమ్మలాపల్లి రామసత్యనారాయణ, ఎంఎం శ్రీలేఖ, సాయి కొర్రపాటి, మల్టీ డైమెన్షన్ వాసు, డిఎస్ రావు, సాయి కొర్రపాటి, రఘు జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.