నటుడు కెప్టెన్ రాజు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

90వ దశకంలో విలన్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్న కెప్టెర్ రాజు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. శత్రువు, రౌడీ అల్లుడు, కొండపల్లి రాజా, గాంఢీవం, మొండి మొగుడు పెంకి పెళ్లాం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన కొచ్చిలోని ఆయన నివాస గృహంలో తుది శ్వాస విడిచారు. కొన్ని నెలల క్రితం.. రాజు అమెరికాకు ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా స్ట్రోక్‌తో బాధపడ్డారు. రాజు తన పరిస్థితిని తెలియజేసిన తరువాత, విమానాన్ని దారి మళ్లించి మస్కట్‌లో లాండ్ చేసింది సిబ్బంది. రాజు ఫ్యామిలీ అభ్యర్థన మేరకు, ఆయన్ను మస్కట్ నుంచి కొచ్చికి చికిత్స నిమిత్తం పంపించారు. ఆ సమయంలో ఆయన కండీషన్ నిలకడగానే ఉంది. కెప్టెన్ రాజు ఇండియన్ ఆర్మీని వదిలేసి 1981లో తతన నట జీవితాన్ని ప్రారంభించారు. తెలుగు, కన్నడ, మలయాళం సహా 500లకు పైగా చిత్రాల్లో రాజు నటించారు. ఆయన మృతితో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.