హీరోలే నా పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ దేవదాస్‌ల గురించి?

-రెండు భిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ప్రయాణం. పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ నేపథ్యంలో ఉంటుంది. ఈ సినిమా ద్వారా సందేశాలుగట్రా ఇవ్వాలన్న ఉద్దేశ్యం లేదు
.
ఇంతకీ కథేమిటి?

-శమంతకమణి సినిమా టైమ్‌లో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ కథను చెప్పారు. కథ ప్రకారం నాగార్జున, నానిలకు చెప్పడం వారికి నచ్చడంతో సినిమా సెట్స్‌పైకి వచ్చింది.

చాలా కాలం తర్వాత నాగార్జునతో..

-నాగార్జునతో అప్పట్లో ఆజాద్ సినిమా చేశాను. ఆ తర్వాత మళ్లీ ఆయన సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాం. నాగార్జున కథలో ఇన్‌వాల్వ్ అయ్యే విధానం కానీ, మేకింగ్‌లో దగ్గరుండి సలహాలు ఇవ్వడం, ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు. ఆయన్ని చూస్తుంటే ఎన్టీఆర్ గుర్తొచ్చారు. అలాగే నాని కూడా మంచి డెడికేషన్ ఉన్న నటుడు. తను డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌నుంచి వచ్చాడు కాబట్టి ప్రేక్షకుల నాడి బాగా తెలుసు. వీరిద్దరి కాంబినేషన్ తెరపై పండగలా ఉంటుంది.

మహానటి లాంటి సినిమాలు మళ్లీ వస్తాయా?

-నాటి తరం నటీనటులతో మొదలైన వైజయంతి బ్యానర్‌లో అలనాటి నటి సావిత్రి జీవిత కథ చెప్పడం ప్రెస్టేజీగా అనిపించింది. ఈ సినిమా విషయంలో మా అమ్మాయిలు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. నేనొకటే చెప్పాను. సావిత్రి కథను చెప్పాలంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేసేలా ఉండాలి. దానికోసం ఖర్చుకు వెనుకాడద్దని చెప్పాను. 17 కోట్లతో అనుకున్న సినిమా కాస్తా 27 కోట్లకు చేరింది. భవిష్యత్‌లో అలాంటి కథలు చేయొచ్చు.
నటన, దర్శకత్వంపై ఆసక్తి..?
-ఇన్నాళ్ల అనుభవంలో నాకెప్పుడూ కెమెరా ముందుకు రావాలని, దర్శకత్వం చేయాలని అనిపించలేదు. ఎవరి పని వారు చేస్తే బావుంటుంది.

సినిమాల విషయంలో మీ ప్రాధాన్యత?

-నేను హీరోల కోసమే సినిమా చేస్తాను. హీరోలంటే నాకు అంత ఇష్టం. తర్వాతే కథ, దర్శకుడు...

హీరోలను పరిచయం చేయడం..?

- మా బ్యానర్‌లో హీరోలను లాంచ్ చేయడం అన్నది మహేష్‌బాబుతో మొదలైంది. అలాగే ఎన్టీఆర్‌ను స్టూడెంట్ నెం.1తో పరిచయం చేశాను. ఆ సినిమాతోనే గ్రేట్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజవౌళినీ, చిరుతతో చరణ్, అల్లు అరవింద్‌తో కలసి గంగోత్రితో బన్నీని, అలాగే బాణం సినిమాతో నారా రోహిత్, ఎవడే సుబ్రహ్మణ్యంతో విజయ్‌దేవరకొండను పరిచయం చేశా.

తెలుగులో భారీ చిత్రాలపై..?

- నిజమే. ఇప్పుడు భారీ చిత్రాలు అన్నది సర్వసాధారణంగా మారింది. నిజానికి కథ ప్రకారం ఎంత బడ్జెట్ పెట్టాలి. ఎంత పెడితే ఎంత వసూలవుతుందన్నది కూడా దృష్టిలో పెట్టుకొని సినిమా చేస్తే మంచిది. కానీ కొందరు ఇది తెలియకుండానే భారీ సినిమాలు తీస్తున్నారు.

తదుపరి చిత్రాలు?

- ఎన్టీఆర్‌తో ఓ సినిమా ఉంటుంది. అలాగే విజయ్ దేవరకొండతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాం. అలాగే చిరంజీవితో సినిమా ఉంటుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది. మా అమ్మాయిలు హిందీలో కూడా చిత్రాలు నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

శ్రీ