నాన్న పాస్ చేశాడు.. చేయాల్సింది ప్రేక్షకులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతూ రాము కొప్పుల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఈ మాయ పేరేంటో?’. కావ్య థాపర్ హీరోయిన్. వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా హీరో విజయ్ రాహుల్ చెప్పిన విశేషాలు...
ఈ సినిమాలో నేను పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాను. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి కాలనీలో సరదాగా తిరిగే అబ్బాయి. అయితే అతని జీవితంలోకి ఓ అమ్మాయి ఎంట్రీ అయితే ఎలా వుంటుంది. దానివల్ల అతని జీవితంలో జరిగిన మార్పులేంటి? అతని జీవిత లక్ష్యాలను చేరుకున్నాడా లేదా అనేదే కథ. ఔట్ అండ్ ఔట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వుంటుంది. చిన్నప్పటినుంచీ సినిమా వాతావరణంలో పెరగడంవల్ల సినిమాలపై ఆసక్తి వుండేది. నేను 8వ తరగతి చదివేటప్పుడు నాన్న సినిమాల్లో నటిస్తావా? అని అడిగారు. అప్పుడే నిర్ణయించుకున్నాను, హీరో అవ్వాలని. దానికోసం మార్షల్ ఆర్ట్స్, బ్యాంకాక్ వెళ్లి ఫైట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. దేవదాస్ కనకాల, సత్యానంద్‌ల దగ్గర గతంలో శిక్షణ తీసుకున్నాను. చిన్నప్పటినుంచే డాన్స్ అంటే ఇష్టం. అంతకుముందే లారెన్స్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. అన్నిరకాలుగా ట్రైనింగ్ తీసుకున్న తరువాత హీరోగా ఎంట్రీ ఇస్తున్నాను. ఫైట్ మాస్టర్ కొడుకు కాబట్టి యాక్షన్ సినిమా చెయ్యవచ్చు కదా అని అడుగుతున్నారు. యాక్షన్ సినిమా ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానికి చాలామంది హీరోలున్నారు. ఇపుడు నా వయసు ప్రకారం ప్రెష్ ఫీల్ వుండే ప్రేమకథలు చేయడమే సరైన నిర్ణయం. అందుకే ఈ సినిమా చేస్తున్నాను. దర్శకుడు రాము చెప్పిన కథ బాగా నచ్చింది. ముఖ్యంగా నాన్న కూడా ఈ సినిమా విషయంలో ఈ కథ నీకు బాగుంటుందని చెప్పడంతో సినిమా మొదలుపెట్టాం. నిజానికి ఈ సినిమాను సుకుమార్ నిర్మిస్తానని అన్నారు. కానీ తను రంగస్థలం సినిమాతో బిజీగా వుండడంవల్ల మా సొంత బ్యానర్‌లోనే నిర్మించాం. సొంత బ్యానర్‌లో సినిమా చేయడం అంటే కాస్త రిస్కే. అయినా ఈ సినిమా వ్యవహారాలన్నీ మా సోదరి దగ్గరుండి చూసుకుంది. సినిమా ఫస్ట్ కాపీ చూసిన తరువాత నాన్న నా దగ్గరకు వచ్చి 30 సంవత్సరాలుగా సినిమాల్లో వున్నాను, నీ సినిమా సక్సెస్ అయ్యేది కానిదీ చెప్పను కానీ హీరోగా నువ్వు పాస్ అవుతావు అని చెప్పడంతో చాలా ఆనందం వేసింది. హీరోగా భిన్నమైన సినిమాలు చేయాలనుంది. తప్పకుండా మంచి గుర్తింపు తెచ్చుకుంటాను. ఈ సినిమా తరువాత న్యూ ఏజ్ లవ్‌స్టోరీ ఒకటి చేస్తున్నాను. అందులో నిహారికతో కలిసి నటిస్తున్నాను.