జో అచ్యుతానంద అంటోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘శౌర్య’ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా మారిన నటి రెజీనా, శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘జో అచ్యుతానంద’ సినిమాలో హీరోయిన్‌గా చేయనుంది. గతంలో ‘ఊహలు గుహగుసలాడే’ వంటి రొమాంటిక్ సినిమాని ప్రేక్షకులకందించిన అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాని ఇద్దరు అన్నదమ్ముల కథకు ప్రేమకథను జోడించి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నారా రోహిత్ హీరోగా, నాగశౌర్య అతని తమ్ముడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్, శ్రీనివాస్ అవసరాల ఇద్దరూ పలు సినిమాల్లో నటిస్తుండటంవల్ల ఈ చిత్రం ఏప్రిల్ మొదటివారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇకపోతే ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కళ్యాణ్ కోడూరి సంగీతాన్ని అందించనున్నారు.