జానూ.. నువ్వెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవ్ జాదవ్, పవిత్ర, బ్రమిని ప్రధాన తారాగణంగా ఎస్.జె.ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై కుమార్.బి సమర్పణలో రూపొందిస్తున్న చిత్రం ‘జానూ నువ్వెక్కడ?’. సురేష్ దర్శకత్వంలో దీపక్, సోహైల్ జిలాని రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ప్రియురాలికి ప్రియుడు ఎంత దూరమైనా వెంటనే అనుకునే పేరు ‘జానూ నువెక్కడ?’ అని, అటువంటి ఓ అందమైన కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో పాటలు హైలెట్‌గా వుంటాయని తెలిపారు. పాటలను మంచి మంచి లొకేషన్లలో చిత్రీకరించామని, హీరో హీరోయిన్ల డాన్సులు సినిమాలో హైలెట్‌గా వుంటాయని తెలిపారు. సినిమా పేరుకు తగిన విధంగా కథ కథనాలు సాగుతాయన్నారు. యువతకు నచ్చేలా అన్ని ఎలిమెంట్స్‌తో రూపొందించామని వారు తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. రేవంత్ తదితరులు నటించిన చిత్రానికి దర్శకత్వం, సంగీతం:సురేష్ సబ్‌నే, నిర్మాతలు:దీపక్, సోహైల్ జిలాని.