ప్రేమ షికార్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ శృతిహాసన్ ఈమధ్య సినిమాలపై పెద్దగా ఫోకస్ పెట్టడంలేదు. ఆమె నటించిన చివరి చిత్రం కాటమరాయుడు. దాంతోపాటు కమల్‌హాసన్‌తో కలిసి శభాష్ నాయుడు సినిమాలో నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలని తెగ ప్రయత్నాలు చేసింది కానీ వర్కవుట్ కాకపోవటంతో ఫీలైనట్టుంది. అందుకే సౌత్‌లో ఏ సినిమా చేయడానికి ఆసక్తి చూపడంలేదు. ఇక ప్రస్తుతం మ్యూజిక్ వైపు ఫోకస్ పెట్టిన శృతి లండన్‌లో ఓ కానె్సర్ట్ చేసింది. ఆ షో సక్సెస్ అవ్వడంతో శృతిమించిన ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. ఈ ఉత్సాహంతో మరిన్ని షోలు చేయడానికి ప్లాన్ చేస్తోందని టాక్. అయితే ఈ కానె్సర్ట్‌లో ఆమె బాయ్‌ఫ్రెండ్ మైకేల్ కోర్సెల్ కూడా వెంటే ఉన్నాడన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ కలిసి చెట్టపట్టాలు వేసుకుని తెగ తిరుగుతున్నారన్నది బి టౌన్ టాక్. పెళ్లికి ముందు సాగే డేటింగ్ టైంని ఈ జంట పూర్తిగా వినియోగించుకుంటోందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి శృతిహాసన్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మ్యూజిక్‌పైనే ఉంది.. అంటే ఆమె ఇక హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఇప్పట్లో లేనట్టే.