అభినేత్రికి సీక్వెల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా ఓ సూపర్ చిత్రానికి సీక్వెల్ చేసి.. ఆ సినిమా క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఈ దర్శకుడు మాత్రం భారీ ఫ్లాప్ అయిన సినిమాకు సీక్వెల్ చేస్తానని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఏమా కథ అంటే.. ఈమధ్యే మిల్కీ భామ తమన్నా కీ రోల్‌లో, ప్రభుదేవా హీరోగా వచ్చిన అభినేత్రి చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ త్రిభాషా చిత్రం తమిళ్‌లో మాత్రం యావరేజ్‌గా నిలిచింది కానీ హిందీ, తెలుగులో అట్టర్‌ఫ్లాప్ అయింది. ఆ తరువాత విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవా నటించిన లక్ష్మి కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినాసరే ప్రభుదేవా - దర్శకుడు విజయ్‌లు కలిసి అభినేత్రి సినిమాకు సీక్వెల్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఇందులో కూడా తమన్నా హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అభినేత్రి 2 టైటిల్‌తో ఈ సినిమా రానుందట. ఒక ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ఎందుకు తంబి అంటూ సోషల్ మీడియాలో జోరుగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.