ఇప్పుడు.. ఏడుస్తున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్నటికి మొన్న మెంటల్ కృష్ణ. ఇప్పుడు -బిల్డప్ కృష్ణ. రెండు సినిమాల్లో కామన్ కృష్ణ మాత్రం పోసాని కృష్ణమురళి. శ్రావ్య మూవీస్ బ్యానర్‌పై లక్ష్మీ టాకీస్ సమర్పిస్తోన్న చిత్రమిది. సరీష్, గీత హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రంలో ప్రధాన పాత్ర మాత్రం పోసానిదే. వినె్సంట్ సెల్వ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ -‘బిల్డప్ కృష్ణ’లో చాలా ముఖ్యమైన పాత్రలో చేశా. అప్పట్లో ఐదారు కుటుంబాల మధ్య ‘కీ’ పాత్రలో గొల్లపూడి మారుతీరావు ఎలా నటించేవారో, ఈ చిత్రంలో నాది అలాంటి పాత్ర. చాలాకాలం తర్వాత మంచి పాత్ర దొరికింది. రెండు కుటుంబాలను ఎలా విడదీయాలి? లేదంటే ఎలా కలపాలి? వంటి పాత్రలు మారుతీరావు చేశారు. దర్శకుడు వినె్సంట్ ఇప్పుడు అలాంటి పాత్ర నాకు సినిమాలో ఇచ్చారు. రైటర్‌గా ఉన్నప్పుడు కూడా నాకు నేను రాసుకోలేకపోయా. ఎవరికీ ఇలాంటి పాత్ర రాయలేకపోయా. ఈ సినిమాలో నా పాత్ర చూస్తుంటే గొల్లపూడే కనబడతారు. నా పాత్రకి ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే టైటిల్ కూడా ‘బిల్డప్ కృష్ణ’ అని పెట్టారు. ఇప్పటివరకు ఎన్నో పాత్రల్లో నవ్వించా. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గానూ కనిపించా. కానీ ఇందులో ట్రాజెడీ తరహాలో పెద్దగా ఏడ్చే పాత్ర చేస్తున్నా. నా పాత్రే కాదు, సినిమా కథా ప్రాక్టికల్‌గా, సహజంగా, లవ్‌బుల్‌గా ఉంటుంది. ఒక మగాడు తప్పు చేయడానికి సమాజంలో ఎలాంటి వాతావరణం ఉందో, అలాగే ఓ ఆడది రాంగ్ రూట్‌లో వెళ్లడానికీ సొసైటీలోని కారణాలను సహజంగా ఇందులో చూపించారని పోసాని వివరించారు.