మనం సైతం... సేవ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం సైతం సేవా కార్యక్రమాలు నిర్విరామంగా సాగుతున్నాయి. ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న మనం సైతం.. సేవా సంస్థ శనివారం మరికొందరు పేదలకు ఆర్థిక సాయం అందించింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు కోటి, నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకురాలు నందినీరెడ్డి, నటుడు రాజీవ్ కనకాల, నటి రజిత, డాన్స్ మాస్టర్ సత్య, గాయని విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. చినయోగిరెడ్డి, వర్షిత, లీలాధర్, మురళీ కృష్ణారెడ్డి, గన్నోజి గంగాధర్, అభిషేక్, దిలీప్‌తేజా, కళ్యాణ్, డీవీకే నాగేశ్వరరావు, అభినయలకు ఆర్థిక సాయంగా అతిథులు చెక్‌లు అందించారు. కాదంబరి కిరణ్ మాట్లాడుతూ ‘పేదరికాన్ని రూపుమాపలేకున్నా, కొందరికైనా ఆర్థిక దన్ను కలిగించాలన్నదే ఈ సంస్థ ఉద్దేశం. గతేడాది సంస్థ విజ్ఞప్తి మేరకు వివిధ ఆసుపత్రుల యాజమాన్యాలు 43 లక్షల రూపాయల బిల్లులు తగ్గించారు. ఈ ఏడాది ఇప్పటికి 90మందికి సహాయం చేశాం. పరిశ్రమలో చిరంజీవి, కృష్ణగారి దగ్గరనుంచి ఎంతోమంది మనం సైతంకు చేయూతనిస్తున్నారు. త్వరలో జూ.ఎన్టీఆర్, మంత్రి కేటీఆర్‌తో కలిసి పెద్ద కార్యక్రమం చేయాలన్న సంకల్పం ఉంది’ అన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ పరిశ్రమలో పేదలకు ఆదుకునే ఆపన్నహస్తం ఇప్పుడు కనిపిస్తోంది. కాదంబరి మంచి పని చేస్తున్నాడు, అభినందనలు. నావంతుగా 50 వేల సాయం అందిస్తా’నని ప్రకటించారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ మాటలు చెప్పడం సులువేనని, మంచి పని చేయడం చాలా కష్టమన్నారు. కాదంబరి కిరణ్ అలాంటి శ్రమను తీసుకున్నాడని, తన ఆలోచనను ఆచరించి చూపిస్తున్నాడు ప్రశంసించారు. ఇంకా చాలామందికి కాదంబరి సేవలు అందాలని ఆకాంక్షిస్తూ, గొప్ప పరిశ్రమలో గొప్పగా ఉండీ పేదలకు సాయం చేయలేకపోతే సిగ్గుపడాలని అన్నారు.