క్రాంతిమాధవ్ దర్శకత్వంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్‌గా స్టార్ ఇమేజ్‌ని స్వంతం చేసుకుని ‘అందాల రాముడి’తో హీరోగా మారిన సునీల్, ప్రస్తుతం ‘ఈడు గోల్డెహె’, ‘జక్కన్న’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాల తరువాత ఆయన చేసే తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయి. సునీల్ హీరోగా నటించే చిత్రానికి క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తాడు. ‘ఓనమాలు’ సినిమాతో దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ సినిమాతో ప్రూవ్ చేసుకున్న క్రాంతిమాధవ్ ఇటీవలే సునీల్‌తో చర్చలు జరిపాడని, కథ విన్న సునీల్ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. అచ్చతెలుగు కథతో అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు హ్యూమన్ వాల్యూస్‌కి ప్రాధాన్యతనిస్తూ రూపొందే ఈ చిత్రాన్ని యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయని, త్వరలోనే హీరోయిన్ ఎవరనే విషయం తెలియజేస్తారట. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.